Begin typing your search above and press return to search.

ఈ డెవిల్ చాలా స్టైలిష్ గురు

భారీ బడ్జెట్ తో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 7:22 AM GMT
ఈ డెవిల్ చాలా స్టైలిష్ గురు
X

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తోన్న మూవీ డెవిల్. పీరియాడిక్ జోనర్ లో బ్రిటిష్ ఇండియాలో పనిచేసే గూఢచారి పాత్రలో కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. అతను సీక్రెట్ ఏజెంట్ గా చేసిన సాహసాలు ఏంటి అనేది డెవిల్ మూవీలో చూపించబోతున్నారు.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. భారీ బడ్జెట్ తో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. పొలిటికల్ లీడర్ గా మాళవిక నాయర్ క్లానిపిస్తోంది.

బాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరోజీ ఫస్ట్ టైం తెలుగులో డెవిల్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో ఒక బ్రిటిష్ మోడల్ గా ఆమె కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ బట్టి తెలుస్తోంది. చాలా బలమైన కథ, కథనాలతో ఈ మూవీ తెరకెక్కుతోందని టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది. అమిగోస్ తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం.

ఈ చిత్రంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి కళ్యాణ్ రామ్ పార్టీ లుక్ ఒకటి చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో షూట్ తో చాలా స్టైలిష్ గా కళ్యాణ్ రామ్ ఉండటం విశేషం. వైబ్రెంట్ గా కనిపిస్తోన్న ఈ పోస్టర్ లుక్ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే ఏదో పబ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.

భారీ అంచనాల మధ్య రిలీజ్ కి సిద్ధం అవుతోన్న ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు అలరిస్తుంది అనేది వేచి చూడాలి. బింబిసార తర్వాత మరోసారి అలాంటి బ్లాక్ బస్టర్ కోసం కళ్యాణ్ రామ్ వెయిట్ చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అమిగోస్ చేసిన అది వర్క్ అవుట్ కాలేదు. డెవిల్ మాత్రం కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.