ఈ వీకెండ్ ఓటీటీ రిలీజులివే!
నిన్న కాక మొన్న కొత్త సంవత్సరం మొదలైనట్టు ఉంది. కానీ అప్పుడే ఏప్రిల్ రెండో వారంలోకి కూడా ఎంటరైపోయాం.
By: Tupaki Desk | 10 April 2025 10:50 PM ISTనిన్న కాక మొన్న కొత్త సంవత్సరం మొదలైనట్టు ఉంది. కానీ అప్పుడే ఏప్రిల్ రెండో వారంలోకి కూడా ఎంటరైపోయాం. ప్రతీ వారం లానే ఈ వారం కూడా ఓటీటీ రిలీజ్‌లు ఉన్నాయి. అయితే ఈ వారం మాత్రం ఎప్పటిలా కాకుండా అన్ని జానర్లకు సంబంధించిన సినిమాలు, సిరీస్‌లు రిలీజవుతున్నాయి. మరి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఏమేం రిలీజవుతున్నాయో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
హిందీ మూవీ ఛావా ఏప్రిల్ 11 నుంచి అందుబాటులోకి రానుంది.
హాలీవుడ్ సిరీస్ బ్లాక్ మిర్రర్ సీజన్7 ఏప్రిల్ 10న రిలీజ్ అయింది.
ఫ్రోజెన్ హాట్ బాయ్స్ అనే థాయ్ మూవీ ఆల్రెడీ రిలీజై ఆడియన్స్ కు అందుబాటులో ఉంది.
బ్యాడ్ ఇన్లుఫ్లుయెన్స్: ది డార్క్ ఆఫ్ కిడ్‌ఫ్లుయెన్సింగ్ అనే హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 9 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
జియో హాట్‌స్టార్‌లో..
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్6 ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది.
పెట్స్ అనే హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 11నే విడుదల కానుంది.
ప్రైమ్ వీడియోలో..
హిందీ మూవీ ఛోరీ2 ఏప్రిల్ 11నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జపనీస్ మూవీ మొబైల్ సూట్ గుండం: జీక్యూఎక్స్ ఏప్రిల్ 8 నుంచే ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చింది.
సోనీలివ్‌లో..
మలయాళ సినిమా ప్రావీంకుడు షాపు ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది.
యాపిల్ టీవీలో..
యువర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అనే హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 11 నుంచి అందుబాటులోకి రానుంది.
ఎన్నో కథలు, డిఫరెంట్ జానర్లతో ప్రతీ ఒక్కరికీ కావాల్సిన కంటెంట్‌ను ఓటీటీలు ఈ వారం అందిస్తున్నాయి. వీటిలో ఏయే సినిమాలు ఓటీటీలో కూడా సక్సెస్ అవుతాయో చూడాలి.
