Begin typing your search above and press return to search.

మసూద హీరో.. ఈసారి మరో ప్రయోగం..

తిరువీర్ హీరోగా మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ తాజాగా ఎనౌన్స్ అయ్యింది. ఈ సినిమాకి సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:59 AM GMT
మసూద హీరో.. ఈసారి మరో ప్రయోగం..
X

నటుడిగా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనదైన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూ దూసుకుపోతున్న యాక్టర్ తిరువీర్. ప‌రేషాన్‌, జార్జ్ రెడ్డి, ప‌లాస 1978, మ‌సూద లాంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ యాక్టర్ గా తిరువీర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తిరువీర్ హీరోగా మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ తాజాగా ఎనౌన్స్ అయ్యింది. ఈ సినిమాకి సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.


మూన్ షైన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సాయి మ‌హేష్ చందు, సాయి శ‌శాంక్ నిర్మిస్తోన్న ఈ చిత్రంతో రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ద్రిష్టి త‌ల్వార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే రెండు విభిన్న ప్రపంచల నేప్-నేపత్యాలలో కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఓ వైపు హిందూ మైథాలజీ ప్రకారం దేవతల ప్రపంచం ఉంది.

దానికి ప్రతిబింబంగా క్రిస్టియన్ మైథాలజీ ప్రకారం తెల్లని వస్త్రాలతో స్వర్గం ఉంది. ఈ ఈ రెండు ప్రపంచల మధ్య ఒక బిడ్డని రిప్రజెంట్ చేశారు. అతనే సినిమాలో కథానాయకుడు అయ్యి ఉంటాడని పోస్టర్ బట్టి అర్ధమవుతోంది. పోస్టర్ అయితే చాలా యునిక్ కాన్సెప్ట్ తో డిజైన్ చేశారు. కథని కూడా ఇలాగే రెండు విభిన్న ప్రపంచల నడుమ జరిగేదిగా చూపిస్తారేమో చూడాలి.

డార్క్ కామెడీ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నట్లు నిర్మాత తెలిపారు. తిరువీర్ క్యారెక్టర్ ఈ సినిమాలో అందరిని ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతం అందించబోతున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై ఏ స్థాయిలో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది అనేది వచ్చే ఏడాది తెలిసే ఛాన్స్ ఉంది. హీరోగా మసూదతో తిరువీర్ సక్సెస్ అందుకున్నారు. తరువాత తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ వచ్చిన ఆకట్టుకోలేదు. ఈ సినిమా మీద అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి.