Begin typing your search above and press return to search.

ప్రవీణ్ సత్తారుతో తిరువీర్.. ఏకంగా భారీ బడ్జెట్ సీరీస్ లో...

విభిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు టాలెంటెడ్ హీరో తిరువీర్.

By:  Tupaki Desk   |   23 July 2023 10:19 AM GMT
ప్రవీణ్ సత్తారుతో తిరువీర్.. ఏకంగా భారీ బడ్జెట్ సీరీస్ లో...
X

విభిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు టాలెంటెడ్ హీరో తిరువీర్. వెబ్ సిరీస్‌ అయినా, సినిమా అయినా.. అటు ఓటీటీ ప్రేక్షకులను, ఇటు థియేటర్ ఆడియెన్స్‌ను తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్నారు. కారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. లీడ్ రోల్స్ పోషించే స్థాయికి ఎదిగారు.

విలన్‌గానూ, సపోర్టింగ్ రోల్స్‌లోనూ తిరువీర్ నటించారు. ఇక హీరోగానూ మెప్పించారు. రీసెంట్ గా మసూద చిత్రంతో తొలిసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే నేడు(జులై23)తన పుట్టిన రోజు సందర్భంగా .. ఆయన అప్ కమింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ అప్డేట్ అధికారికంగా అనౌన్స్ చేశారు.

అదేంటంటే.. ఇటీవలే తిరువీర్.. పరేషాన్ అంటూ ఆడియెన్స్ ను నవ్వించారు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో దర్శకుడు ప్రవీణ్ సత్తారు వెబ్ సిరీస్ కూడా ఒకటి. మిషన్ తషాఫి పేరుతో రానున్న ఈ సీరీస్ లో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సీరీస్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఆయన.. షూటింగ్ సెట్ లో జాయిన్ అయ్యారు. అలా తిరువీర్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా మిషన్ తషాఫిలో తిరువీర్ న‌టిస్తున్నారంటూ మూవీ టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అలాగే ఇదే విషయం పై.. తిరువీర్ మాట్లాడుతూ.. ప్ర‌వీణ్ స‌త్తారు వంటి డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌ని చేయ‌టం ఎంతో సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు.

భారత్ దేశంలో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఓ విదేశీ తీవ్రవాద సంస్థకు, ఇండియన్ రా ఏజెంట్స్‌కు మధ్య జరిగే హై ఇంటెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌రే ఈ మిషన్ తషాఫి. 8 ఎపిసోడ్‌లుగా ఈ మిషన్ తషాఫి వెబ్ సిరీస్‌ను.. ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్ తో ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్నారు. ఇది త్వరలోనే జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఫారిన్ లొకేష‌న్స్‌లో ఈ సీరీస్ ను చిత్రీక‌రిస్తున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ ఆధ్వర్యంలో ఫైట్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు ప్ర‌వీణ్ స‌త్తారు.