Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు `ఏరా..పోరా` అని పిలుచుకునేవారు!

ఇద్ద‌రు చాలా కాలం పాటు మంచి స్నేహితులుగా ఉన్న‌ట్లు సీని య‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ తెలిపారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 8:07 AM GMT
ఇద్ద‌రు `ఏరా..పోరా` అని పిలుచుకునేవారు!
X

ఎంత‌మంది స్నేహితులున్నా! కొంద‌రితో స్నేహం ఎంతో ప్ర‌త్యేక‌మైనది. కొంద‌రితో బాగా ద‌గ్గ‌రైన స్నేహం ఏర్ప‌డుతుంది. బెస్ట్ ప్రెండ్ అంటూ ఒక‌రుంటారు. ఇండస్ట్రీలో చంద్ర‌మోహ‌న్ కి అలాంటి ప్రెండ్ ఒక‌రు న్నారు. ఆయ‌నే న‌ట భూషణ్ శోభ‌న్ బాబు. ఇద్ద‌రు చాలా కాలం పాటు మంచి స్నేహితులుగా ఉన్న‌ట్లు సీని య‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ తెలిపారు. వాళ్ల‌తో పాటు అప్పుడ‌ప్పుడు తాను క‌లిసేవాడిన‌ని..ముగ్గురుతో స‌ర‌దాగా ఉండేద‌న్నారు.

ముఖ్యంగా శోభ‌న్ బాబు..చంద్ర‌మోహ‌న్ స్నేహం మాత్రం చాలా ప్ర‌త్యేక‌మైంది అన్నారు. ఇండ‌స్ట్రీలో ఎంత మంది స్నేహితులున్నా వాళ్లిద్ద‌రి స్నేహం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఇద్ద‌రు ఏరా..పోరా అనిపిలుచునేంత‌గా వాళ్ల స్నేహం బ‌ల‌ప‌డింది. అప్ప‌టికే శోభ‌న్ బాబు పెద్ద స్టార్ అయినా ఆ చ‌నువు కేవ‌లం చంద్ర‌మోహ‌న్ కే ఇచ్చారన్నారు. త‌ర్వాత కాలంలో ఆ స్నేహం ఒక‌ర్ని విడిచి ఒక‌రు ఉండ‌లేనంత బ‌లంగా మారింది.

ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ కి షిప్ట్ చేసే క్ర‌మంలో జంట‌గా చెన్నైలోనే ఉంటాం త‌ప్ప హైద‌రాబాద్ త‌ర‌లి వ‌చ్చేది లేద‌ని ఏకంగా న‌ట‌సార్వ‌బౌమ ..నాటి ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామార‌వుతోనే వారించారు. మీలాంటి వాళ్లు వ‌స్తే బాగుంటుంద‌ని రామారావు గారు చెప్పినా వితండ వాదం చేసిన స్నేహితుల‌గానూ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత స‌న్నిహితంగా మెల‌గ‌డం పెద్ద‌గా క‌నిపిచ‌దు.

హీరోల మ‌ధ్య పోటీ ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి ఇలాంటి స‌న్నివేశాలు పెద్ద‌గా క‌నిపించ‌వు. కానీ పాత రోజుల్లోనే వాళ్లెంత గొప్ప స్నేహితులు అన్న‌ది అప్ప‌టి స‌న్నివేశాలు అద్దం ప‌డుతున్నాయి. ఇప్పుడా ప్రాణ స్నేహితుడి ద‌గ్గ‌ర‌కే చేరుకున్నాడు.