Begin typing your search above and press return to search.

ఛాన్స్ ఇచ్చి జ్యోతిష్యుడు చెప్పాడ‌ని తీసేసారు

ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ షిప్ గురించి ఓపెన్ గానే చెప్పారు కాబ‌ట్టి వివాదానికి తావులేని అంశంగా మారింది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 3:45 AM GMT
ఛాన్స్ ఇచ్చి  జ్యోతిష్యుడు చెప్పాడ‌ని తీసేసారు
X

త‌మ‌న్నా బోయ్ ప్రెండ్ గా ఫేమ‌స్ అయిన త‌ర్వాత విజ‌య్ వ‌ర్మ ఏం? మాట్లాడినా నెట్టింట ట్రెండ్ అవుతుంది. అంత‌కు ముందు వ‌ర‌కూ విజ‌య్ వ‌ర్మ కేవ‌లం న‌టుడు మాత్ర‌మే..త‌మ‌న్నాకి బోయ్ ప్రెండ్ అయిన త‌ర్వాత ఆయ‌న క్రేజ్ మార్కెట్ లో రెట్టింపు అయిన‌ట్లు క‌నిపిస్తుంది. అంతా త‌మ‌న్నా బోయ్ ప్రెండ్ అంటూ ప‌బ్లిక్ గానే మాట్లాడుకుంటున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ షిప్ గురించి ఓపెన్ గానే చెప్పారు కాబ‌ట్టి వివాదానికి తావులేని అంశంగా మారింది.

దీంతో అంతా ఓపెన్ అన్న‌ట్లే ఇద్ద‌రి గురించి చ‌ర్చ సాగుతుంది. ఇంత‌కాలం మీడియాకి దూరంగా ఉన్న విజ‌య్ వ‌ర్మ కూడా ఇదే అదునుగా త‌న స్వీయా అనుభ‌వాల్ని అంతే ఓపెన్ గా పంచుకుంటున్నాడు. బాలీవుడ్ లో అత‌డు ఎదిగిన వైనం.. అవ‌మానాలు..న‌టుడిగా ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర్కో వాల్సి వ‌చ్చింది వంటి అంశాల్ని వివ‌రిస్తున్నాడు. త‌మ‌న్నా బోయ్ ప్రెండ్ కావ‌డంతో ఆయ‌న ఏం మాట్లాడినా నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి ఎదుగుదల క‌ష్టాల గురించి గుర్తు చేసుకున్నాడు. ఆరంభంలో చాలా సినిమా అవ‌కాశాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని.. ఓ జ్యోతిష్యుడు ద‌ర్శ‌కుడుకి విజ‌య్ వ‌ర్మ ఉంటే సినిమా పోతుంద‌ని భావించి చెప్ప‌డంతో ఆ సినిమా నుంచి అత‌న్ని నిర్దాక్ష‌ణ్యంగా ఎంపిక చేసి మ‌రీ తొల‌గించిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ సినిమా నుంచి త‌న‌ని కేవ‌లం మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే త‌ప్పించార‌ని అన్నాడు.

ఎన్నో అవ‌మానాలు ఎదుర్కుంటే త‌ప్ప ఇంత‌టి గుర్తింపు రాలేద‌ని అన్నాడు. ఎదిగే క్ర‌మంలో ఇష్టం లేక‌పోయినా చాలా ర‌కాల పాత్ర‌లు పోషించాల్సి వ‌చ్చింద‌ని...అవ‌న్నీ కేవ‌లం డ‌బ్బు అవ‌స‌రం కోస‌మే అలా చేయాల్సి వ‌చ్చింద‌ని గుర్తు చేసుకున్నాడు. విజ‌య్ వ‌ర్మ తెలుగు నటుడు అన్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ కి చెందిన విజ‌య్ వ‌ర్మ ముంబైలో స్థిర‌ప‌డ‌టంతో అక్క‌డ ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ అయ్యాడు. తెలుగులో `ఎంసీఎ` సినిమాలో విల‌న్ గానూ న‌టించిన సంగ‌తి తెలిసిందే.