Begin typing your search above and press return to search.

భయపెట్టే పిండం.. వాళ్ళు అసలు చూడొద్దట

ఫస్ట్ లుక్ తోనే హారర్ ఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఆ తరువాత కూడా వరుస అప్డేట్స్ తో సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 5:57 AM GMT
భయపెట్టే పిండం.. వాళ్ళు అసలు చూడొద్దట
X

శ్రీరామ్, కుశీ రవి కీలక పాత్రల్లో నటించిన హారర్ డ్రామా పిండం డిసెంబర్ 15న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సాయికిరణ్ దైద దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను కళాహి మీడియా పతాకంపై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఫస్ట్ లుక్ తోనే హారర్ ఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఆ తరువాత కూడా వరుస అప్డేట్స్ తో సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.


ట్రైలర్, టీజర్, పాటలు అలాగే ఇతర ప్రమోషనల్ మెటీరియల్‌లతో సరైన స్ట్రాటజీతో సినిమాను జనాలకు చేరువయ్యేలా చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఈ వారం సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుంచి పిండం సినిమాకు A సర్టిఫికెట్‌ని మంజూరు చేశారు. దీంతో సినిమా సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది.

పిండం సినిమా ఆశ్చర్యకరంగా, A సర్టిఫికేషన్ పొందడంతో సినిమా యూనిట్ ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు చెప్పడం విశేషం. ఇప్పటికే సెన్సార్ నుంచి కొన్ని కటింగ్స్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో భయపెట్టే సన్నివేశాలు అలాగే మరికొన్ని ఊహించని సెన్సిటివ్ సీన్స్ బలంగా ఉండబోతున్నాయట. ఇక గర్భిణీ స్త్రీలకు ఈ సినిమా చూడడం అసలు మంచిది కాదని పేర్కొంటూ బృందం కఠినమైన విషయాన్ని తెలిపింది.

సాధారణంగా ఎలాంటి సినిమా అయినా సరే సినిమా యూనిట్ వాళ్ళు ఇలాంటి విషయాలు పెద్దగా హైలెట్ చేయరు. కానీ పిండం మేకర్స్ మాత్రం జాగ్రత్తలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రకటన సినిమాపై ఆసక్తిని పెంచింది. నల్గొండలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆత్మలు ఆవహించిన ఇంట్లో చిక్కుకున్న మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది.

శ్రీనివాస్ అవసరాల మరియు ఈశ్వరీ రావు పిండమ్‌లో ఇతర కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయడమే కాకుండా ప్రమోషన్స్ లోను మేకర్స్ జోరు చూపిస్తున్నారు. మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త హారర్ మూవీ ఇది అంటూ దర్శకుడు చెబుతున్నారు.అలాగే ఈ చిత్రం డిఫరెంట్ టైమ్స్ లలో 1930లు, 1990లు మరియు నేటి కాలానికి తగ్గట్టుగా ఉంటుందట. పిండం సినిమాకు కృష్ణ సౌరభ్ సంగీతం సమకూర్చగా, సతీష్ మనోహరన్ కెమెరామెన్ గా వర్క్ చేశారు.