Begin typing your search above and press return to search.

నా సామీ రంగా.. నాగ్ కంటే వాళ్ళకే ఎక్కువ

తండ్రి మరణం తర్వాత కామెడీ జోనర్ లో సినిమాలు చేసిన పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 4:41 AM GMT
నా సామీ రంగా.. నాగ్ కంటే వాళ్ళకే ఎక్కువ
X

కామెడీ చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అల్లరి నరేష్. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అల్లరి సినిమాతో అడుగుపెట్టి, ఆ సినిమానే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. తండ్రి దర్శకత్వంలోనే వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. తండ్రి మరణం తర్వాత కామెడీ జోనర్ లో సినిమాలు చేసిన పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

ఈవీవీ స్థాయిలో కామెడీని జోడించి కథని చెప్పడం ఎవరికి సాధ్యం కాలేదు. దీంతో కెరియర్ వరుస ఫ్లాప్ లు ఖాతాలో వేసుకున్నాడు. అయితే కామెడీ హీరోగా చేస్తూనే నటుడిగా ముద్రపడే పాత్రలు కూడా చేస్తూ వచ్చారు. గమ్యంలో గాలి శ్రీను పాత్ర నరేష్ కి మంచి పేరు తీసుకొచ్చింది. తరువాత శంభో శివ శంభో సినిమాలో చేసిన రోల్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో నరేష్ చేసిన పాత్ర అయితే నటుడిగా అతన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్ళింది. ఇదిలా ఉంటే ఓ వైపు నరేష్ హీరోగా చేస్తూనే మరో వైపు ఇతర హీరోల చిత్రాలలో కీలక పాత్రలలో నటిస్తున్నాడు. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న నా సామిరంగా సినిమాలో అంజిగాడు పాత్రలో నరేష్ జీవించబోతున్నాడు.

ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందంట. ఈ సినిమాలో నరేష్ తో పాటు రాజ్ తరుణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హీరోగా రాజ్ తరుణ్ కి గత కొన్నేళ్ల నుంచి సరైన సక్సెస్ లేదు. దీంతో రూట్ మార్చి నా సామి రంగా సినిమాలో నటించాడు. నరేష్ కెరియర్ కి అంజిగాడు రోల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి.

అలాగే రాజ్ తరుణ్ కి కూడా ఈ సినిమా సక్సెస్ తో పాటు చాలా కీలకం. రాజ్ తరుణ్ పాత్రకి మూవీలో గుర్తింపు వస్తే తరువాత స్టార్ హీరోల చిత్రాలలో కీలక పాత్రలకి ఛాయస్ గా మారుతాడు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. సంక్రాతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.