Begin typing your search above and press return to search.

ఓం భీమ్ బుష్.. మరో డిఫరెంట్ స్ట్రాటజీ

ఐదేళ్ల క్రితం బ్రోచేవారెవరురా సినిమాతో టాలీవుడ్ మూవీ లవర్స్ ను ఓ రేంజ్ లో నవ్వించిన వీరు ముగ్గురు.. మరోసారి ఫుల్ గా నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   18 March 2024 4:28 PM GMT
ఓం భీమ్ బుష్.. మరో డిఫరెంట్ స్ట్రాటజీ
X

ఓం భీమ్ బుష్.. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా మార్చి 22వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. ఐదేళ్ల క్రితం బ్రోచేవారెవరురా సినిమాతో టాలీవుడ్ మూవీ లవర్స్ ను ఓ రేంజ్ లో నవ్వించిన వీరు ముగ్గురు.. మరోసారి ఫుల్ గా నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కు రెస్పాన్స్ వేరే లెవల్ లో వచ్చింది. దీంతో మూవీ పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్ గా మారనుందని సినీ పండితులు చెబుతున్నారు. వీ సెల్యులాయిడ్ సమర్పణలో హుషారు ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హిందీ బిగ్ బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ తోపాటు ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటించారు.

అయితే ఈ సినిమాకు ప్రమోషన్లు ఇంతవరకు ఎప్పుడు చూడని రీతిలో చేస్తున్నారు మేకర్స్. సోషల్ మీడియాలో రోజుకొక వెరైటీ ప్రమోషన్ తో వస్తున్నారు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్. ఇటీవల జరిగిన అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా వదల్లేదు. ఈ సినిమాలో బ్యాంగ్ బ్రోస్ గా కనిపించే వీరు ముగ్గురు మరో క్రేజీ ప్రమోషనల్ వీడియో చేశారు. దాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అందులో ఓ మీడియా సంస్థలో ఉన్నట్లు కనిపిస్తున్న ముగ్గురు.. తమకు కాల్ లో వస్తున్న ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. అప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిందని ఎందుకన్నా అని ఒకరు అడగ్గా.. మొక్కలు పెంచమని సూచించారు. రాత్రి పూట మంచి వీడియోలు దొరకడం లేదని చెప్పగా.. పొద్దున్న వెతుక్కోండని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. లవర్ బ్రేకప్ చెప్పిందని అంటే.. బ్యాక్ లేబుల్ తాగమని క్రేజీగా చెబుతారు.

సినిమాలు చూడటానికి డబ్బులు ఉండటం లేదని అని అడిగితే, డిటైల్స్ ఇస్తే టికెట్ పంపుతామని అంటారు. అవతార్-3లో ఛాన్స్ వచ్చిందని విన్నామని అడగ్గా.. తామే డేట్స్ ఇవ్వడం లేదని క్రేజీగా చెబుతారు. ఓం భీమ్ బుష్ సినిమా ఇంట్లో వాళ్లతో చూడొచ్చా అని అడిగితే.. కుటుంబ సమేతంగా చూడొచ్చని చెబుతారు. సినిమాలో మంచి సామెతలు ఉంటాయని, వాటికోసం అంతా చర్చించుకుంటారని అంటారు. మొత్తానికి వీడియో అంతా ఫన్నీ ఫన్నీ గా సాగింది. మరి ఈ వెరైటీ ప్రమోషన్లు.. సినిమాకు ఎలాంటి లాభాలను ఇస్తుందో వేచి చూడాలి.