Begin typing your search above and press return to search.

శ్రీలీలను చూసి వారు కూడా షాక్‌ అవుతున్నారేమో..!

ఇక అంతా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   2 Nov 2023 8:45 AM GMT
శ్రీలీలను చూసి వారు కూడా షాక్‌ అవుతున్నారేమో..!
X

పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమా నిరాశ పరిచినా కూడా లక్కీగా శ్రీలీల కి టాలీవుడ్‌ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అందులో ధమాకా తో పాటు మరికొన్ని సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. నటనతో పాటు డాన్స్ తో మాస్ ను మరియు క్లాస్ ను అల్లాడించే విధంగా శ్రీ లీల సందడి చేస్తోంది.

ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపుగా పది సినిమాలు ఉన్నాయని టాక్‌. ఇటీవలే స్కంద మరియు భగవంత్ కేసరి సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఈ నెలలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా తో శ్రీలీల రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో శ్రీలీల ఎలా ఉండబోతుందో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మాస్ లుక్ లో సూపర్ డాన్స్ ను చేస్తూ ఆదికేశవ లో శ్రీలీల సందడి చేయబోతుంది.

ఇక డిసెంబర్‌ లో శ్రీలీల 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నితిన్‌ హీరోగా రూపొందిన ఆ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక అంతా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఇలా వరుసగా నెలకు ఒక సినిమా చొప్పున విడుదల చేసే అవకాశం కేవలం శ్రీలీలకు మాత్రమే దక్కింది అంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఈ అమ్మడు ఒకే నెలలో రెండు సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

శ్రీలీల ఈ రేంజ్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతూ ఉంటే తోటి స్టార్‌ హీరోయిన్స్ అయిన రష్మిక మందన్నా, పూజా హెగ్డే ఇతర హీరోయిన్స్ షాక్ అవుతున్నారేమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారు కచ్చితంగా శ్రీలీల సినిమాల సంఖ్యను మరియు సక్సెస్‌ రేటును చూసి షాక్ అవుతూ ఉంటారేమో.