Begin typing your search above and press return to search.

సంబ‌ర‌మంతా సితార‌లోనే..దుమ్ముదులిపేసిందిగా!

తాజా వీడియో అలాగే అభిమానుల‌కు క‌నెక్ట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

By:  Tupaki Desk   |   24 Oct 2023 5:45 AM GMT
సంబ‌ర‌మంతా సితార‌లోనే..దుమ్ముదులిపేసిందిగా!
X

ఏదైనా పండ‌గ వ‌చ్చిందంటే ఆ పండ‌గంతా త‌న‌దే అంటుంది సితార ఘ‌ట్ట‌మ‌నేని. ఓ స్పెష‌ల్ వీడియోతో సోష‌ల్ మీడియానే షేక్ చేస్తుంది. అంతా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కోసం ర‌క‌ర‌కాల జిమ్మిక్కులు ప్లే చేస్తుంటారు. కానీ క్యూట్ సితార మాత్రం ఓ డాన్స్ వీడియో పెడితే చాలు అది నెట్టింట వాయు వేగంతో వైర‌ల్ అవుతుంది. తాజాగా సితార ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని మ‌రో వీడియో తో అభిమానుల ముందుకు వ‌చ్చేసింది.

ఇదిగో ఇలా అందంగా ముస్తాబై ఓ హిందీ పాట‌కు డాన్సు చేస్తూ క‌నిపించింది. అయితే ఈసారి సోలోగా కాకుండా..గ్రూప్ సాంగ్ తో అభిమానుల ముందుకొచ్చింది. త‌న‌దైన శైలి సిగ్నెచ‌ర్ స్టెప్పుల‌తో ఆక‌ట్టుకుంది. సితార హిప్ మూవ్ మెంట్ ఇచ్చిందంటే? మాముల‌గా ఉంటుంది. రెండు చేతులు గాల్లోకి తిప్పి...కాళ్లు క‌దుపుతుంటే! ఎన‌ర్జీ అంతా త‌న‌కే సొంత‌మ‌నిపిస్తుంది. సితార ఏపాట‌కి డాన్సు చేసినా చాలా ఎన‌ర్జిటిక్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంటుంది.

తాజా వీడియో అలాగే అభిమానుల‌కు క‌నెక్ట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు సితార డాన్సుకు ఫిదా అవుతున్నారు. న‌టి కాక ముందు సితార గొప్ప డాన్స‌ర్ అంటూ ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటుంది. సితార‌లో ఈ ర‌క‌మైన ఎగ్జైట్ మెంట్ చూసి కెమెరా ముందుకు ఎప్పుడోస్తుందా? అని అభిమానులు ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

చ‌దువులు పూర్త‌యిన త‌ర్వాత కెమెరా ముందుకొచ్చేస్తుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగించి అగ్ర‌నాయిక‌గా ఎదుగుతుంది. న‌టిగా న‌మ్ర‌త సాధించ‌లేని విజ‌యాలు కుమార్తె సాధిస్తుంది. ఇది రాసిపెట్టుకునే అంశమంటూ అభిమానులంతా ఓ అంచ‌నాకి వ‌చ్చేసారు. గౌత‌మ్ హీరో అవుతాడా? లేదా? అన్న‌ది సెకెండ‌రీ..ముందు సితార‌ని మాత్రం హీరోయిన్ గా చూసుకోవాల‌ని అభిమా నులు భావిస్తు న్నారు. సితార కూడా అందుకు సంసిద్దంగానే ఉంది.