Begin typing your search above and press return to search.

వెబ్ సీరీస్ మాస్టర్స్.. అందులో లిమిటేషన్స్ లేవంటున్న దర్శక ద్వయం..!

ఆ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా వెబ్ సీరీస్ లు డైరెక్ట్ చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   7 March 2024 3:30 PM GMT
వెబ్ సీరీస్ మాస్టర్స్.. అందులో లిమిటేషన్స్ లేవంటున్న దర్శక ద్వయం..!
X

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో ఓటీటీ వరల్డ్ లో సంచలనం సృష్టించిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే వెబ్ సీరీస్ లకు ఇంత డిమాండ్ పెరిగింది అంటే అది వారు వేసిన బాటే అని చెప్పొచ్చు. ఇండియాలో ఓటీటీల ప్రభావం అంతగా లేనప్పుడే వారు వెబ్ సీరీస్ చేయాలని అనుకున్నారు. ఆ టైం లో ఇక్కడ ఓటీటీ సంస్థలు లేవు. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఇండియాకు రావడంతో వారు తొలి వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ ని తెరకెక్కించారు. ఆ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా వెబ్ సీరీస్ లు డైరెక్ట్ చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు.

వెబ్ సీరీస్ డైరెక్టర్స్ గా రాజ్ అండ్ డీకే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఓటీటీలపై వీరు చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు, ఓటీటీలో వచ్చే వెబ్ సీరీస్ లకు చాలా డిఫరెంట్ ఉంటుంది. మేము మొదట వెబ్ సీరీస్ తీయాలని అనుకున్నప్పుడు ఓటీటీ సంస్థలు లేవ్. నెట్ ఫ్లిక్స్ అప్పటికి ఇండియాకు రాలేదు. ఆ టైం లో సీరీస్ ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా అర్ధం కాలేదు. అందుకే స్ట్రీమింగ్ ఇక్కడ మొదలు కాగానే మేమే ఫస్ట్ అందులో వెబ్ సీరీస్ చేశాం.

వెబ్ సీరీస్ కంటెంట్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఇన్ని గంటల్లోనే సీరీస్ ను పూర్తి చేయాలనే లిమిటేషన్ ఉండదు. మన దగ్గర ఉన్న కంటెంట్ మొత్తాన్ని ఆడియన్స్ కు నచ్చేలా తెరకెక్కించవచ్చు. అది 2 గంటలైనా సరే 10 ఎపిసోడ్ ల వెబ్ సీరీస్ అయినా అని అంటున్నారు రాజ్ అండ్ డీకే. వెబ్ సీరీస్ అయితే అనుకున్న కథను కుదించాల్సిన అవసరం అయితే ఉండదని అన్నారు. ఇక కొత్త టెక్నాలజీ ఏఐ ను తాము ఇప్పుడిప్పుడే ఉపయోగిస్తున్నాం అంటున్న ఈ దర్శకులు క్యారెక్టర్ డిజైన్ ఎలా ఉండాలో ఏఐ హెల్ప్ తో చేస్తున్నామని అన్నారు.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ రెండు సీజన్లు సూపర్ హిట్ అందుకున్న రాజ్ అండ్ డీజే లాస్ట్ ఇయర్ ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ తో కూడా ఆడియన్స్ ని అలరించారు. పస్తుతం వరుణ్ ధావన్, సమంత నటించిన సిటాడెల్ ను రెడీ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా రిచర్డ్ మ్యాడెన్ చేసిన హాలీవుడ్ సీరీస్ కు ఇది రీమేక్ గా వస్తుంది.