Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. తెలుగులో కనిపించడమంటే ఇదేనేమో

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   2 April 2024 6:27 AM GMT
ఫ్యామిలీ స్టార్.. తెలుగులో కనిపించడమంటే ఇదేనేమో
X

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టాల్ సినిమా ఈ వారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజ నిర్మాణంలో పరుశురామ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మృణాల్ టాగూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ అయితే జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తూ ఉన్నారు.


దీంతో మేకర్స్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస ప్రమోషన్స్ తో చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నారు. సినిమాకు హాలిడేస్ కలిసి రావడంతో పాటు పోటీగా కూడా పెద్దగా ఏ సినిమాలు లేవు. అందుకే సినిమాకు కావలసినంత హైప్ క్రియేట్ చేసి మంచి ఓపెనింగ్స్ అందుకునే విధంగా చేయాలి అని మేకర్స్ గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు అనిపిస్తోంది.

అయితే సాధారణంగా నిర్మాత దిల్ రాజు తన ప్రతి సినిమాకు కేవలం మాట్లాడడం వరకే ఉంటారు. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా విషయానికి వచ్చేసరికి ఆయన ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా హైలెట్ అవుతూ కనిపిస్తూ ఉన్నారు. స్టెప్పులు కూడా వేస్తున్నారు. విజయ్ దేవరకొండ మృణాల్ తో పాటు ఆయన కూడా ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తూ ఎంతగానో ఆకర్షిస్తున్నారు.

ఒక సినిమా నచ్చితే దిల్ రాజు ఎంతగా జనాల్లోకి తీసుకు వస్తారో మరోసారి ఈ సినిమాతో అర్థం అవుతోంది. ఇక లేటెస్ట్ గా వీరు కనిపించిన విధానం మరింత వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ముగ్గురు కూడా అచ్చమైన తెలుగు సంప్రదాయ పద్దతిలో కనిపిస్తున్నారు. పంచే కట్టులో విజయ్ దేవరకొండ రాజు గారు, హీరోయిన్ ను మైమరిపించే విధంగా ఫోకస్ అయ్యారు అని మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఇక సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో వారి హావా భావాలను చూస్తూనే అర్థమవుతుంది అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక చాలా పాజిటివ్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ లోకి సినిమాను తీసుకు వెళుతున్నట్లుగా చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా దర్శకుడు పరశురామ్ మాత్రం కేవలం కొన్ని ఇంటర్వ్యూలలో మాత్రమే కనిపించాడు.

ఎందుకంటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ దర్శకుడు ఇంకా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా అవుట్ ఫుట్ ఫినిష్ అయినప్పటికీ కొన్ని మిక్సింగ్ వర్క్ లలో ఏమాత్రం పొరపాట్లు లేకుండా మళ్లీ మళ్లీ చెక్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా హడావిడి కి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.