Begin typing your search above and press return to search.

ఎదురుచూపులకు తెర.. వచ్చేసిన ఫెయిల్యూర్ మూవీ

రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా దాదాపుగా రూ.75 కోట్ల వసూళ్లను రాబట్టిటనట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   5 March 2024 8:21 AM GMT
ఎదురుచూపులకు తెర.. వచ్చేసిన ఫెయిల్యూర్ మూవీ
X

విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రలో నటించిన 12th ఫెయిల్‌ చిన్న సినిమాగా విడుదల అయ్యి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా దాదాపుగా రూ.75 కోట్ల వసూళ్లను రాబట్టిటనట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

థియేట్రికల్‌ రిలీజ్ కంటే కూడా ఓటీటీ ద్వారా ఈ సినిమా ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. మొన్నటి వరకు ఈ సినిమాను హిందీలో మాత్రమే ప్రేక్షకులకు డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు అందుబాటులో ఉంచారు.

సౌత్‌ ప్రేక్షకులు ఈ సినిమా గురించి మీడియాలో వినడం, చూడటం ద్వారా స్థానిక భాషల్లో చూడాలని ఆశ పడ్డారు. కానీ హిందీలో మాత్రమే అందుబాటులో ఉండటంతో ఇన్ని రోజులు తమ భాష లో చూడటం కోసం ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు సౌత్‌ లోని అన్ని భాషల్లో 12th ఫెయిల్‌ మూవీ అందుబాటులోకి వచ్చింది. తెలుగు తో పాటు తమిళంలో ఈ సినిమాను ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయని డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు భావిస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్‌ 29 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాకు ఇప్పటికి సౌత్‌ ఇండియన్ భాషల వర్షన్‌ లు రావడంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విక్రాంత్‌ మాస్సే కు జోడీగా మేధా శంకర్‌ హీరోయిన్‌ గా నటించింది. విధు వినోద్‌ చోప్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.