Begin typing your search above and press return to search.

ది విలేజ్.. ఆర్య హారర్ అలజడి

చాలామంది యువ హీరోలు స్టార్ నటీనటులు కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   9 Nov 2023 3:36 PM GMT
ది విలేజ్.. ఆర్య హారర్ అలజడి
X

చాలామంది యువ హీరోలు స్టార్ నటీనటులు కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రూట్ లో కూడా ఇప్పుడు మంచి ఆదాయం అందుతూ ఉండడంతో నటీనటులు ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు వెబ్ సిరీస్ చేసేందుకు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు.

కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా స్టార్స్ రేంజ్ చాలా ఈజీగా పెరిగిపోతుంది. అందుకే ఓటీటీ ప్రపంచంలోకి చాలా మంది స్టార్స్ అడుగుపెడుతున్నారు. ఇక లిస్టులో ఇప్పుడు ఆర్య కూడా చేరిపోతున్నాడు. నటుడుగా తమిళ ఇండస్ట్రీలో పలు విభిన్నమైన సినిమాలు చేసిన ఆర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా కొన్ని చేశాడు.

ముఖ్యంగా తెలుగులో అల్లు అర్జున్ వరుడు సినిమాలో కూడా అతను పవర్ ఫుల్ విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అతని నుంచి ఒక భిన్నమైన వెబ్ సిరీస్ రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ది విలేజ్ అనే వెబ్ సిరీస్ లో ఆర్య నటించాడు. ఇక కంటెంట్ కు సంబంధించిన టీజర్ను కూడా విడుదల చేశారు.

ఒక విలేజ్ లో ఊహించిన విధంగా రాక్షసులు ఎక్కువగా తిరుగుతున్నట్లు చూపించారు. ఇక ఆ శక్తులను అడ్డుకున్నందుకు హీరో అలాగే అతని టీం ఇలా పోరాడింది అనే అంశం ఈ సిరీస్లో పైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మిలింద్ రాజ్ దర్శకత్వంలో రానున్న ఈ వెబ్ సిరీస్ ను ద విలేజ్ అనే గ్రాఫిక్ నవల ఆధారంగా రూపొందుతోంది.

ఈనెల 24 నుంచి దీన్ని తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. మొత్తానికి టీజర్ అయితే చాలా భయంకరంగా ఉంది. కంటెంట్ కూడా ఏమాత్రం డిఫరెంట్ గా ఉన్న మంచి క్రేజ్ అందుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో హారర్ కాన్సెప్ట్ లో వస్తున్న సినిమాలకు వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక ది విలేజ్ అనే ఈ వెబ్ సిరీస్ ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ ప్రాజెక్టులో దివ్య, పిళ్ళై అనుకూలం నరేష్, జార్జ్, పూజ రామచంద్రన్ కీలక పాత్రలలో నటించారు.