Begin typing your search above and press return to search.

2 రోజులే: ది వ్యాక్సిన్ వార్ మూవీ వన్ ప్లస్ వన్ ఆఫర్

టీజర్ తో ఒక్కసారి అందరినోట్లో నానిన మూవీ ‘ది వ్యాక్సిన్ వార్’.

By:  Tupaki Desk   |   1 Oct 2023 2:49 PM GMT
2 రోజులే: ది వ్యాక్సిన్ వార్ మూవీ వన్ ప్లస్ వన్ ఆఫర్
X

టీజర్ తో ఒక్కసారి అందరినోట్లో నానిన మూవీ ‘ది వ్యాక్సిన్ వార్’. కశ్మీర్ ఫైల్స్ లాంటి సంచలన మూవీకి దర్శకత్వం వహించిన వివేక్ అగ్నిహోత్రి డైరెక్టు చేసిన ఈ మూవీ.. విడుదలకు ముందు పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసింది. విడుదలకు ముందు వరకు ఈ మూవీ బజ్ బాగాన్నా.. సరిగ్గా విడుదలయ్యే వేళలో ఈ సినిమా మీద ప్రచారం తగ్గిపోవటంతో రిలీజ్ విషయంలో తేడా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వ్యాక్సిన్ తయారీ మీద తీసిన సినిమా.. సైంటిఫిక్ గా ఉండటం.. కాస్తపాటి డాక్యుమెంటరీ వాసనలు కనిపించటంతో మాస్ ప్రేక్షకులను ఆకర్షించే విషయంలో సినిమా వెనుకబడిందన్న టాక్ వినిపిస్తోంది. మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ ను కనెక్టు చేసే విషయంలో తేడా కొట్టిందన్న టాక్ వినిపిస్తున్న వేళ.. ఈసినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రకటనను చేసింది మూవీ టీం.

ఈ సినిమాను ఈ రోజు (ఆది).. రేపు (సోమవారం) రెండు రోజులు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితమని.. ఈ స్పెషల్ ఆఫర్ ఈ రెండు రోజులకే పరిమితమని పేర్కొంది. బుక్ మై షో.. పీవీఆర్ ఐనాక్స్.. సినీపోలీస్ వెబ్ సైట్లు.. యాప్ ద్వారా బుక్ చేసుకునే వారికి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ ఆఫర్ ను ప్రకటించినట్లు పేర్కొన్నారు.

భారతదేశం తన సొంత వ్యాక్సిన్ ను తనకు తానుగా తయారు చేసుకోవటం.. దీనికి సంబంధించి బయటకు రాని ఎన్నో విషయాల్ని ఈ సినిమాలో చర్చించారు. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ మీద జరిగిన దుష్ఫ్రచారం.. దాని వెనుక ఏం జరిగిందన్న అంశాల్ని ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లుగా కనిపించినా.. నాటకీయత లోపించటం ఈ సినిమాకు పెద్ద ఆదరణ లేదన్న విమర్శ వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమాను చూస్తున్నంత సేపు కొవిడ్ కాలం కళ్ల ముందుకు గుర్తు తేవటమే కాదు.. ఒకట్రెండు సన్నివేశాల్లో తీవ్ర ఉద్వేగానికి గురయ్యేలా ఉందని చెప్పాలి.

కొవాగ్జిన్ టీకా తయారీలో మహిళా సైంటిస్టులు చేసిన పోరాటం.. పడిన కష్టం కళ్లకు కట్టినట్లుగా చూపించటంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. కోట్లాది మంది ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు భారత సైంటిస్టులు పడిన శ్రమను తెలియజేసేలా ఈ మూవీ ఉంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. తన సినిమాను చూసిన తర్వాత ఒక్క అమ్మాయి అయినా స్ఫూర్తి పొంది వైరాలజిస్టుగా మారితే తన మూవీకి దక్కిన విజయంగా భావిస్తానని పేర్కొన్నారు. మరి.. ఈ ఆఫర్ తర్వాత అయినా ఈ సినిమా మీద టాక్ లో మార్పు తెస్తుందేమో చూడాలి.