Begin typing your search above and press return to search.

దిల్ అన్న వారసుడు సోలో డేట్ పట్టేశాడుగా

బేబీ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన వైష్ణవి చైతన్య.. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

By:  Tupaki Desk   |   24 March 2024 12:05 PM GMT
దిల్ అన్న వారసుడు సోలో డేట్ పట్టేశాడుగా
X

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు, యంగ్ హీరో ఆశిష్ ప్రస్తుతం లవ్ మీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బేబీ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన వైష్ణవి చైతన్య.. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు.


ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినీ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. చిత్రంపై భారీ అంచనాలు పెంచాయి. సినిమాలో ఆడియన్స్ ను కట్టిపడేసే స్టోరీ తో పాటు భయాన్ని కలిగించే హారర్ ఎలిమెంట్స్ ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మేకర్స్ ఇస్తారని టీజర్ బట్టి చెప్పవచ్చు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25వ తేదీన లవ్ మీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు పోస్టర్ ను కూడా రివీల్ చేశారు. అందులో ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రేమగా హగ్ చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇక దిల్ రాజు వారసుడు సోలో డేట్ పట్టేశాడని, కరెక్ట్ టైమ్ కే వస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఏప్రిల్ 5వ తేదీన భారీ బడ్జెట్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అక్టోబర్ నెలకు వాయిదా పడింది. దీంతో యువ హీరోలంతా ఆ నెలలో వచ్చేస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా దిల్ రాజే నిర్మిస్తున్నారు. అంటే ఒకే నెలలో దిల్ రాజు బ్యానర్ పై రూపొందిన రెండు సినిమాలు వస్తున్నాయన్నమాట.

ఇక లవ్ మీ సినిమా స్టోరీ విన్నప్పుడు ఆర్య కథ గుర్తుకు వచ్చినట్లు దిల్ రాజు ఇది వరకే చెప్పిన విషయం తెలిసిందే. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్ అని చెప్పారు. దీంతో అందరూ మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆశిష్, వైష్ణవి నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. స్టార్ టెక్నీషియన్ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేస్తున్నారు. మరి ఈ మూవీతో ఆశిష్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.