Begin typing your search above and press return to search.

కార్తిని అలా ఫిక్సైన తెలుగు ఆడియన్స్..!

ఈగ సినిమా తమిళంలో రిలీజ్ అయ్యాక అక్కడకు వెళ్తే మా తమిళ అబ్బాయిలా ఉన్నావ్ అనేవారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 5:48 AM GMT
కార్తిని అలా ఫిక్సైన తెలుగు ఆడియన్స్..!
X

తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ లో రాజ్ మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జపాన్. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చిన జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాని, కార్తీ ఫ్యాన్స్ హంగామాతో జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈగ సినిమా తమిళంలో రిలీజ్ అయ్యాక అక్కడకు వెళ్తే మా తమిళ అబ్బాయిలా ఉన్నావ్ అనేవారు.

తమిళ్ నుంచి వచ్చిన హీరోల్లో చాలామంది కార్తీని చూస్తే మన తెలుగు అబ్బాయే అని అనుకుంటారు. అది స్మైల్, సెలెక్ట్ చేసుకునే సినిమాలో కావొచ్చు అందరు తెలుగు ఆడియన్స్ కార్తీని ఓన్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ 3 హిట్లు కొట్టాడు. ప్రతి సినిమా చాలా కొత్తదనంతో చేస్తారు. ఈ ఇయర్ మరీ షాకింగ్ గా జపాన్ అంటూ వస్తున్నాడు. ఈ గెటప్ చాలా కొత్తగా ఉంది. జపాన్ సినిమా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని అన్నారు నాని.

అలా మొదలైంది సినిమా టైం లో ఇద్దరం ఏదో ఫంక్షన్ లో కలిశాం. జెర్సీ టైం లో కూడా కార్తీ తనకు ఫోన్ చేశాడు. జపాన్ లాంటి సినిమాలు తీసి కన్విన్స్ చేయడం చాలా కష్టం. ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎనర్జీ గా అనిపించింది. నవంబర్ 10న ఆడియన్స్ కి కూడా ఇదే ఎనర్జీ ఇస్తుందని అన్నారు నాని. అను ఇమ్మాన్యుయెల్ మజ్ను తెలుగులో పరిచయమైంది. ఈ సినిమా ఆమె కెరీర్ లో మరో మంచి సినిమాగా నిలవాలని అన్నారు.

ప్రభు చేస్తున్న సినిమాలన్నీ తాను ఫాలో అవుతున్నానని. ఈమధ్య కూడా ఒక హిట్ సినిమా చేశారు. జపాన్ కూడా ఆయనకు మంచి సక్సెస్ అవ్వాలని నిర్మాత ప్రభు గురించి చెప్పారు నాని. ఈవెంట్ లో భాగంగా యాంకర్ సుమ నాని, కార్తీలను కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది. కార్తీతో తాను మల్టీస్టారర్ కి రెడీ అన్నారు నాని. తాను బయోపిక్ చేస్తే రజినికాంత్ ది చేస్తానని అన్నారు. అంతేకాదు కార్తీని తన దసరా లాంటి సినిమాలో చూడాలని అన్నారు నాని.