Begin typing your search above and press return to search.

ఆ సూప‌ర్ స్టార్ త‌మ్ముడు ఈ యాంక‌ర్ త‌మ్ముడితో!

ఇంత‌కీ ఎవ‌రా అన్నా త‌మ్ముడు. ఏంటి ఆ క‌హానీ అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

By:  Tupaki Desk   |   30 Jan 2024 10:01 AM GMT
ఆ సూప‌ర్ స్టార్ త‌మ్ముడు ఈ యాంక‌ర్ త‌మ్ముడితో!
X

యాంక‌ర్ త‌మ్ముడు కోసం బాలీవుడ్ నుంచి ఏకంగా సూప‌ర్ స్టార్ త‌మ్ముడినే రంగంలోకి దించుతున్నారా? ఆన్ స్క్రీన్ పై ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములవుతారా? బద్ద శ‌త్రువులు అవుతారా? లేక త‌మ్ముడు కోసం స‌ర్ ప్రైజ్ గా అన్న‌సీన్ లోకి వ‌స్తాడా? తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇంత‌కీ ఎవ‌రా అన్నా త‌మ్ముడు. ఏంటి ఆ క‌హానీ అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.


అశ్విన్ బాబు హీరోగా గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్వరరెడ్డి మౌళీ ఓ సినిమా నిర్మిస్తు న్నాడు. ఈ చిత్రానికి అప్సర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ న‌టుడు ఆర్భాజ్ ఖాన్ ని తీసుకున్నారు. ఆ ఎంట్రీని ఖ‌రారు చేస్తూ చిత్ర నిర్మాత‌లు..ద‌ర్శ‌కుడు ఆర్బాజ్ ఖాన్ తో కొన్ని ఫోటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు.

అవి వైర‌ల్ అవ్వడం స‌హా మీడియాకి విష‌యాన్ని అధికారికంగా రివీల్ చేసారు. అర్బాజ్ ఖాన్ తెలుగులో న‌టించ‌డం ఇది రెండ‌వ‌సారి. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి క‌థ‌నాయ‌కుడిగా న‌టించిన `జై చిరంజీవ`తో టాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. ఆ త‌ర్వాత రాజ్ త‌రుణ్ న‌టించిన `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త` అనే మ‌రో చిత్రంలోనూ న‌టించాడు. ఈ రెండు సినిమాల మ‌ధ్య చాలా గ్యాప్ ఉంది.

తాజాగా అశ్విన్ బాబు తో సినిమా చేయ‌డం వెనుక చాలా గ్యాప్ ఉంది. చాలా కాలానికి ఆర్బాజ్ ఖాన్ మ‌ళ్లీ టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతున్నారు. మ‌రి ఇందులో ఆర్బాజ్ ఖాన్ రోల్ ఎలా ఉంటుంది? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం బాలీవుడ్ ఫేమ‌స్ న‌టులే టాలీవుడ్ లో విల‌న్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అశ్విన్ బాబు కోసం విల‌న్ గా తెస్తున్నారా? అన్న‌ది మ‌రో సందేహం. మేకర్స్ మాత్రం కీల‌క పాత్ర గా రివీల్ చేసారు. అర్బాజ్ ఖాన్ ...స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు కాగా...అశ్విన్ బాబు యాంక‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ ఓంకార్ త‌మ్ముడు అన్న సంగ‌తి తెలిసిందే.