Begin typing your search above and press return to search.

సలార్ యాక్టర్ ఈ స్పీడ్ ఏంటి బాబోయ్..!

విపిన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు చిత్ర యూనిట్ వెల్లడించారు.

By:  Tupaki Desk   |   6 April 2024 2:30 AM GMT
సలార్ యాక్టర్ ఈ స్పీడ్ ఏంటి బాబోయ్..!
X

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈమధ్యనే ది గోట్ లైఫ్ ఆడుజీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆడుజీవితం సినిమా కోసం పృథ్వీరాజ్ ఎంత కష్టపడ్డారు. సినిమా కోసం ఆయన చేసిన హార్డ్ వర్క్ గురించి తెలిసిందే. ఆ సినిమా అలా రిలీజైందో లేదో మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లిన పృథ్వీరాజ్ నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేసుకున్నారు. పృధ్విరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా గురువాయూర్ అంబలనదాయిల్. విపిన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు చిత్ర యూనిట్ వెల్లడించారు.

అనుకోని పరిస్థితుల వల్ల మ్యారేజ్ చేసుకున్న హీరో ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్న కథతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ గురువాయూర్ అంబలనదాయిల్ సినిమా వస్తుంది. సినిమా షూటింగ్ పూర్తి కాగా ఏప్రిల్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి మే 23న సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటుగా నిఖిల విమల్, అనస్వర రాజన్, బసిల్ జోసెఫ్ ఇంకా యోగి బాబు ఈ సినిమాలో నటిస్తున్నారు.

డిసెంబర్ లో సలార్ 1 సీజ్ ఫైర్ తో వచ్చిన పృథ్వీరాజ్ మార్చిలో మరో సినిమాతో వచ్చాడు. ఇప్పుడు మళ్లీ మే లో మరో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అవగా మరో సినిమా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. సినిమాల మీద పృథ్వీరాజ్ కు ఉన్న ప్యాషన్ ఎలాంటిదో వరుస సినిమాల రిలీజ్ లను బట్టి అర్థం చేసుకోవచ్చు.

మలయాళ పరిశ్రమలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్న పృథ్వీరాజ్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ లో వరద రాజ మన్నార్ గా నటించిన పృథ్వీరాజ్ తన అసలైన విశ్వరూపం సలార్ 2లో చూపిస్తానని అంటున్నాడు. ప్రభాస్ తో కలిసి సలార్ 2 సెట్స్ మీద ఎంత త్వరగా వెళ్తామా అని ఆసక్తిగా ఉన్నానని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు పృథ్వీరాజ్. సలార్ 1 మొత్తం దేవ, వరదరాజ ఫ్రెండ్ షిప్ మాత్రమే చూపించారు. సెకండ్ పార్ట్ లో వారిద్దరి మధ్య యుద్ధం చూపించబోతున్నాడు. అయితే పృథ్వీరాజ్ దూకుడు చూస్తుంటే సలార్ 2 వచ్చేలోగా మరో రెండు సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేసేలా ఉన్నాడు.