Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా లో టాలీవుడ్ పరిస్థితి దారుణం!

వందల కోట్ల వసూళ్లు పక్కన పెడితే ఉత్తర భారతం తో పాటు సౌత్‌ లోని ఇతర రాష్ట్రాల్లో కనీసం ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేక పోతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2023 5:30 PM GMT
పాన్ ఇండియా లో టాలీవుడ్ పరిస్థితి దారుణం!
X

ఒకప్పుడు హిందీ సినిమాలు మాత్రమే దేశ వ్యాప్తంగా విడుదల అయ్యేవి. కానీ బాహుబలి తర్వాత మొత్తం మారిపోయింది. సౌత్ సినిమా లు కూడా ఉత్తర భారతం లో వందల కోట్ల వసూళ్లు నమోదు చేయగలవు అని నిరూపితం అయ్యింది. హిందీ సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ సినిమాలు కూడా వెయ్యి కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించగలవు అని బాహుబలి నిరూపించింది.

అప్పటి నుంచి వరుసగా ప్రతి ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతూనే ఉన్నాయి. అయితే 2023 ఏడాది పూర్తి అవ్వడానికి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌ నుంచి వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు సాధించలేకపోయాయి.

వందల కోట్ల వసూళ్లు పక్కన పెడితే ఉత్తర భారతం తో పాటు సౌత్‌ లోని ఇతర రాష్ట్రాల్లో కనీసం ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేక పోతున్నాయి. దాంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈసారి తెలుగు సినిమాల సందడి లేదు అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తమిళ్ నుంచి వచ్చిన లియో మరియు జైలర్‌ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లు నమోదు చేస్తున్నాయి.

ఇక బాలీవుడ్‌ కి చెందిన పఠాన్‌, గదర్ 2 మరియు జవాన్‌ సినిమాలు భారీగా వసూళ్లు సాధించాయి. ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లు సాధించిన ఈ అయిదు సినిమాల్లో ఒక్కటి కూడా టాలీవుడ్‌ మూవీ అవ్వక పోవడంతో పాటు, టాలీవుడ్‌ కి సంబంధం ఉన్న హీరో లేదా దర్శకుడి సినిమా కాకపోవడం విచారకరం అంటూ తెలుగు ఫిల్మ్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.