Begin typing your search above and press return to search.

ఆషిఖి 3 పాట‌లే హీరో.. హీరోయిన్ ఎవ‌రూ లేరు!

నిర్మాత మ‌హేష్ భ‌ట్ పార్ట్ 3 రూప‌క‌ల్ప‌న కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 1:30 AM GMT
ఆషిఖి 3 పాట‌లే హీరో.. హీరోయిన్ ఎవ‌రూ లేరు!
X

ఫీల్ గుడ్ ప్రేమ‌క‌థ‌ల‌తో తెర‌కెక్కిన `ఆషిఖి` ఫ్రాంఛైజీ సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టాయి. ఆషిఖి- ఆషిఖి 2 చిత్రాలు అద్భుత విజ‌యాలు సాధించాయి. ఆషిఖి 2 ఒక అప్ క‌మింగ్ గాయ‌కురాలి అంద‌మైన‌ ప్రేమ‌ క‌థ‌తో తెర‌కెక్కి అద్భుతమైన మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ ఫ్రాంఛైజీ నుంచి పార్ట్ 3 రాక కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. కానీ ఎందుక‌నో మూడో భాగం ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌డం ఆల‌స్య‌మ‌వుతోంది. నిర్మాత మ‌హేష్ భ‌ట్ పార్ట్ 3 రూప‌క‌ల్ప‌న కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎట్ట‌కేల‌కు భ‌ట్ ఇక ప‌నులు వేగ‌వంతం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇటీవ‌ల ఈ సినిమాకి క‌థానాయ‌కుడిని ఎంపిక చేసారు. కార్తీక్ ఆర్య‌న్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. ఇంత‌లోనే తారా సుతారియాను క‌థానాయిక‌గా ఎంపిక చేసార‌ని ప్ర‌చారం సాగిపోతోంది. ఇది నిజ‌మేనా? అని నేరుగా నిర్మాత మ‌హేష్ భ‌ట్ నే ప్ర‌శ్నించ‌గా ఆయ‌న షాకిచ్చే జ‌వాబిచ్చారు. ప్రతి వారం నేను ఒక కొత్త హీరోయిన్ పేరును మీడియాలో చదివాను.. అల‌సిపోయేంత రిపీటెడ్‌ జోక్‌గా మారింది! అని భ‌ట్ వ్యాఖ్యానించారు. కాబట్టి తారా సుతారియా ఈ చిత్రంలో న‌టిస్తోంద‌న్న వార్త‌లు కేవ‌లం పుకార్లు మాత్ర‌మేనని క్లారిటీ వ‌చ్యేసింది.

నిజానికి తారా సుతారియా పేరు పరిశీలనలో కూడా లేదు అని మ‌హేష్ భ‌ట్ అన్నారు. నేను మీకు ఒక నిజం చెప్పనా? నా సినిమాకి సంగీతం (సంగీతం) సిద్ధమయ్యే ముందే లీడ్ పాత్ర కోసం ఏ అమ్మాయిని పరిగణనలోకి తీసుకోను. పాటలు ఆషిఖికి ఒక‌ట‌వ‌, రెండ‌వ‌ స్టార్స్. ఈ ఫ్రాంచైజీకి స్టార్ అవసరం లేదు. ఈసారి స్టార్ (కార్తీక్ ఆర్యన్) వచ్చినందుకు మేం సంతోషిస్తున్నాము. కానీ మిగిలినవి పూర్తిగా సంగీతానికి సంబంధించినవి`` అని ముఖేష్ భ‌ట్ అన్నారు. అస‌లు ఈ పుకార్లు ఎక్కడ నుండి మీడియాలోకి వస్తున్నాయో తెలియ‌డం లేద‌ని ఆశ్చర్యపోతున్నాడు. ఈ పుకార్లను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో మీకు తెలుసా? అని ముఖేష్ భట్ ప్రశ్నించారు.

``ఆషిఖి నా ఫ్రాంచైజీ అని మ‌రోసారి స్పష్టం చేస్తున్నాను. నేను కోరుకున్న విధంగా.. నేను కోరుకున్న బృందంతో కలిసి చేస్తాను. నేను ఆషిఖి 3 కోసం సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అయితే, దీనికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తే మంచిది. లేకపోతే మరొక ద‌ర్శ‌కుడితో చేస్తాము`` అని అన్నారు. ఆషిఖి ఫ్రాంఛైజీలో ఆఫ‌ర్ కోసం చాలా మంది క‌థానాయిక‌లు ఆస‌క్తిగా ఉన్నారు. కానీ ఆఫ‌ర్ ఎవ‌రిని వ‌రిస్తుందో వేచి చూడాలి. ఆషిఖి 2లో న‌ట‌న‌కు శ్ర‌ద్ధా క‌పూర్ కి ప్ర‌శంస‌లు కురిసాయి.