Begin typing your search above and press return to search.

మహేష్‌ తుపాకి మిస్ అవ్వడానికి చంద్రశేఖర్ కారణం!

పవన్‌ కళ్యాణ్ తో పాటు పలువురు స్టార్‌ హీరోలు ఎన్నో సూపర్‌ హిట్ కథలు మిస్ అయ్యారు. ఇప్పుడు ఆ విషయం పై చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   18 Nov 2023 1:30 AM GMT
మహేష్‌ తుపాకి మిస్ అవ్వడానికి చంద్రశేఖర్ కారణం!
X

చాలా సార్లు ఈ కథ ఆ హీరోకి రాస్తే మరో హీరోకి వెళ్లింది.. ఆ హీరో హిట్ కొట్టాడు.. లేదా ఈ హీరో కోసం రాసిన కథ ఆ హీరోకి వెళ్లింది.. ఆ హీరోకు డిజాస్టర్‌ పడింది అంటూ వార్తలు చూస్తూ ఉంటాం. పవన్‌ కళ్యాణ్ తో పాటు పలువురు స్టార్‌ హీరోలు ఎన్నో సూపర్‌ హిట్ కథలు మిస్ అయ్యారు. ఇప్పుడు ఆ విషయం పై చర్చ జరుగుతోంది.

అసలు విషయం ఏంటి అంటే సూపర్ స్టార్‌ మహేష్ బాబు గతంలో చాలా కథలు తిరస్కరించాడు. అందులో కొన్ని ఇతర హీరోలు చేశారు. ఇతర హీరోలు చేసిన సినిమాలు కొన్ని హిట్ అవ్వగా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే మహేష్ కోసం రెడీ అయిన కథ.. మహేష్ బాబు వద్దకు రాకుండానే మరో హీరో వద్దకు వెళ్లింది.

తమిళ్ సూపర్‌ స్టార్‌ విజయ్ కెరీర్‌ లో తుపాకి ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా కథ ను దర్శకుడు మురుగదాస్ రాసే సమయంలో మహేష్ బాబును అనుకున్నాడట. స్టోరీ లైన్ అనుకున్న సమయంలోనే మహేష్ బాబు కి బాగుంటుందని భావించి, స్క్రిప్ట్‌ వర్క్ ను మహేష్‌ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా చేశాడట.

తుపాకి కథ విన్న విజయ్‌ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్‌ మహేష్‌ కి కాకుండా చేశాడట. మురుగదాస్‌ చాలా కాలంగా విజయ్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తున్న నేపథ్యంలో చంద్రశేఖర్‌ ఇచ్చిన అవకాశం కాదనలేక పోయాడు. తుపాకి సినిమా ను విజయ్ తో చేసేందుకు రెడీ అయ్యాడు. మహేష్‌ బాబుతో తుపాకి గురించి చర్చలు జరిపాడా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.

మొత్తానికి విజయ్ కెరీర్‌ లో ఒక సూపర్‌ హిట్‌ అయిన తుపాకి సినిమా మిస్‌ అవ్వడంతో దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో స్పైడర్‌ సినిమాను మహేష్‌ చేయాల్సి వచ్చింది. మహేష్‌, మురుగదాస్‌ కాంబోలో వచ్చిన స్పైడర్‌ ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.