Begin typing your search above and press return to search.

కృతితో డేట్ చేయాలంటే క‌నీస అర్హ‌త‌లు?

ఇటీవ‌లే రిలీజైన క్రూ బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   1 April 2024 4:33 AM GMT
కృతితో డేట్ చేయాలంటే క‌నీస అర్హ‌త‌లు?
X

1-నేనొక్క‌డినే సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన కృతి స‌నోన్, ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఏల్తోంది. ఒక్కో సినిమాకు 3-4కోట్ల రేంజు పారితోషికం అందుకుంటున్న ఈ బ్యూటీ కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉంది. హిందీ ప‌రిశ్ర‌మ‌లో కాంపిటీష‌న్ ని త‌ట్టుకుని ప్ర‌తిభ‌తో నిల‌దొక్కుకుంది ఈ అమ్మ‌డు. ఇటీవ‌లే రిలీజైన క్రూ బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కృతి న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.

తాజా ఇంట‌ర్వ్యూలో కృతి స‌నోన్ తాను డేటింగ్ చేసే వ్య‌క్తి అర్హ‌త‌ల గురించి వెల్ల‌డించింది. రాజ్ షమణితో పోడ్ క్యాస్ట్‌లో కృతి మాట్లాడుతూ-``మీరు హాలీవుడ్ న‌టుడు ర్యాన్ గోస్లింగ్ లా హాట్‌గా ఉన్నా నాకు న‌చ్చ‌రు. నేను పూర్తిగా శ్వేతజాతీయుడికి ప‌డిపోను. హాట్‌గా ఉండి ఉండొచ్చు కానీ నేను భారతీయుడు కాని వ్యక్తిని ఇష్ట‌పడను. స్వ‌దేశీ యువ‌కుడితో డేటింగ్ చేయడానికే ఇష్టపడతాను`` అని అంది.

``నేను దేశీగాళ్‌ని కాబట్టి, నాకు కనీసం హిందీ అర్థం చేసుకునే భాగస్వామి కావాలి. అతడు భాష మాట్లాడక‌పోతే స‌మ‌స్యే. నా మనసులోంచి హిందీ వస్తుంది. నేను ఎప్పుడూ ఇంగ్లీషులో మాట్లాడలేను. నేను ఇంగ్లీష్ పాటలకు ఎక్కువ సేపు డ్యాన్స్ చేయలేను. నేను హిందీ పాటలు, పంజాబీ పాటలను ప్లే చేస్తాను`` అని అంది. అలాగే పంజాబి, హిందీ పాట‌ల‌కు డ్యాన్సులు చేసే వ్య‌క్తితో డేటింగ్ చేస్తాన‌ని కూడా హింట్ ఇచ్చింది.

కృతి స‌నోన్ గ‌తంలో ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ప్ర‌భాస్ తో డేటింగ్ చేసింద‌ని పుకార్లు షికార్ చేసాయి. కానీ ఆ పుకార్ల‌ను స్వ‌యంగా ఖండించింది. ప్ర‌భాస్ మంచి స్నేహితుడు మాత్ర‌మేన‌ని వెల్ల‌డించింది. ఇటీవ‌ల క్రికెట‌ర్ ఎం.ఎస్.ధోని స్నేహితుడు క‌బీర్ బ‌హియాతో డేటింగ్ చేస్తోంద‌ని పుకార్లు ఉన్నాయి. ఈ జంట చేయి చేయి క‌లిపి లండ‌న్ వీధుల్లో షికార్ చేస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. కానీ కృతి డేటింగ్ గురించిన ప్ర‌శ్న‌ల‌కు అస్స‌లు స్పందించ‌డం లేదు.