Begin typing your search above and press return to search.

సెలబ్రిటీల జోరు.. మన స్టార్స్ ఓట్లు ఎక్కడెక్కడంటే..

ఇక సెలబ్రిటీల ఓట్లు వేస్తూ మీడియా ద్వారా ప్రజలకి కూడా ఓట్లు వేయమని పిలుపునిస్తారు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 5:49 AM GMT
సెలబ్రిటీల జోరు.. మన స్టార్స్ ఓట్లు ఎక్కడెక్కడంటే..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు తెలంగాణలో అన్ని పార్టీలకి చాలా కీలకంగా మారాయి. సెలబ్రిటీలు అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకొనున్నారు. ఈ రోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల సందడి నెలకొంటుంది. ఇక సెలబ్రిటీల ఓట్లు వేస్తూ మీడియా ద్వారా ప్రజలకి కూడా ఓట్లు వేయమని పిలుపునిస్తారు.


ఇక ప్రస్తుతం మన సెలబ్రిటీలు ఎవరు ఎక్కడ తమ ఓటు వినియోగించుకునున్నారు అనేది చూసుకుంటే జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ పోలింగ్‌ బూత్‌ 165లో మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ఉన్నారు. పోలింగ్‌ బూత్‌ 164లో విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌ ఓటు వేశారు.


అలాగే ఎఫ్‌ఎన్‌సీసీ పోలింగ్‌ బూత్‌ 164లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ లు, పోలింగ్‌ బూత్‌ 160 లో విశ్వక్‌సేన్‌, పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌ పోలింగ్‌ బూత్‌ 149లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌, ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ పోలింగ్‌ బూత్‌ 157 రవితేజ ఓటు వేశారు.


ఓబుల్‌రెడ్డి స్కూల్‌ పోలింగ్‌ బూత్‌ 150లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి, బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌ 153 లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ పోలింగ్‌ బూత్‌ 151లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌ మణికొండ హైస్కూల్ లో ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం, షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమౌళి రామా రాజమౌళి, రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ –ఆర్థిక సహకార సంస్థ కేంద్రంలో అల్లరి నరేశ్‌, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి లైన్ లో నిలబడి ఓటు వేశారు.


వీరితో పాటు సెలబ్రిటీలు అందరూ కూడా వారి పరిధిలో ఉన్న కేంద్రాలలో ఓటు వేయడంతో మీడియా వారిపై ఫోకస్ చేసింది. ప్రజలకకి ఓటుపై అవగాహన కల్పించడానికి సెలబ్రిటీల ద్వారా బైట్స్ కూడా మీడియా వాళ్ళు తీసుకుంటూ ఉండటం విశేషం. గతంలో పోల్చుకుంటే ఈ సారి ఓటింగ్ శాతం తెలంగాణలో పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.