Begin typing your search above and press return to search.

లుంగీ - జుబ్బాతో పాట పాడిన ఒకే ఒక్క‌డు!

అంత‌టి లెజెండ‌రీ గాయ‌కుడు గురించి ఆయ‌న త‌న‌యుడు వెకంట‌నారాయ‌ణ‌మూర్తి ఆస‌క్తిర విష‌యాలు పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 2:30 AM GMT
లుంగీ - జుబ్బాతో పాట  పాడిన ఒకే ఒక్క‌డు!
X

'వివాహ భోజనంబు .. వింతైన వంటకంబు' పాట ఎక్క‌డ వినిపించినా క‌డుపు నిండిపోతుంది. ఎన్ని త‌రాలు మారినా గుర్తిండిపోయే గొప్ప పాట అది. ఆ పాట‌ని ఆల‌పించింది మాధవపెద్ది సత్యం. పాత రోజుల్లో స్వ‌ర్గీయ ఎస్సీ రంగారావు గారికి ఆయ‌నే ఎక్కువ‌గా పాట‌లు..ప‌ద్యాలు పాడేవారు. ఆయ‌న వాయిస్ రంగారావు గొంతు కు ప‌ర్పెక్ట్ గా సూట‌య్యేది. లిప్ సింక్ అంత ప‌క్కాగా యాప్ట్ అయ్యేది. తెర‌పై ఎస్వీరంగ‌రావు పెదాలు క‌దుపు తుంటే? ఆయ‌నే పాడుతున్నారు? అన్నంత‌గా అనిపించేది.

అంత‌టి లెజెండ‌రీ గాయ‌కుడు గురించి ఆయ‌న త‌న‌యుడు వెకంట‌నారాయ‌ణ‌మూర్తి ఆస‌క్తిర విష‌యాలు పంచుకున్నారు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే...'మా నాన్నగారి ఊరు గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరు. వాళ్లు 11 మంది సంతానం. నాకు ఊహ తెలిసిన తరువాత ఏడుగురు మాత్రం ఉండేవారు. మా పెదనాన్నగారి పిల్లలే మాధవపెద్ది రమేశ్ - సురేశ్. మా నాన్నగారికి మా అక్క.. నేను ఇద్దరమే.

అప్పట్లో నాన్నగారు సినిమా పాటలతో పాటు నాటకాలతో బిజీగా ఉండేవారు. మా అమ్మగారి పేరు ప్రభావతి. వారి వివాహం 1951లో జరిగింది. మా నాన్నగారి తరపు బంధువులే ఎస్. జానకి గారు. ఆమె కూడా ఆ పెళ్లికి వచ్చారు. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్లు. నాన్నగారికి ఎంత పేరు వచ్చినా చాలా సింపుల్ గా ఉండేవారు. ఆడంబరాలు ఆయనకి నచ్చేవి కాదు. బహుశా లుంగీ - జుబ్బాతో రికార్డింగ్ థియేటర్ కి వెళ్లి పాడింది మా నాన్నగారు ఒక్కరే కావొచ్చు.

అంత‌కు ముందు గానీ.. ఆత‌ర్వాత గానీ అలాంటి గెట‌ప్ లో స్టూడియోకి వెళ్లి పాడింది నాకు తెలిసి ఎవ‌రూ అలా చేయ‌లేదు. ఆయ‌న ఎక్కడికైనా వెళ్లాలన్నా సైకిల్ పైనే వెళ్లేవారు. సైకిల్ తొక్క‌డం ఆరోగ్యానికి మంచిద‌ని బ‌లంగా న‌మ్మే వ్య‌క్తి. అందుకే సైకిలింగ్ అంటే ఆయ‌నకు అంత ఇష్టం' అని అన్నారు.