Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ- రణ్ వీర్ మూవీ.. ఆ వార్తలన్నీ తూచ్

దాంతోపాటు ఆక్టోపస్ ను కూడా ప్రశాంత్ వర్మ పూర్తి చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   21 May 2024 1:14 PM GMT
ప్రశాంత్ వర్మ- రణ్ వీర్ మూవీ.. ఆ వార్తలన్నీ తూచ్
X

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు. తన యూనివర్స్ లో భాగంగా వచ్చిన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ మూవీ సీక్వెల్ వర్క్ కూడా స్టార్ చేశారు. అందుకు సంబంధించిన అప్డేట్స్ ఇటీవల ఇచ్చారు. దాంతోపాటు ఆక్టోపస్ ను కూడా ప్రశాంత్ వర్మ పూర్తి చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అయితే ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో ఓ సినిమా చేయనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీకి రాక్షస్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తోందని.. మరో మైథలాజికల్ బ్యాక్‌ గ్రౌండ్ లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథగా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అయింది.

ప్రశాంత్ వర్మ, రణ్‌ వీర్ సింగ్ మూవీ ముందడుగు వేయడం లేదని, వీళ్లిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తో సినిమా ఆగిపోయిందని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఏమాత్రం కూడా నిజం లేదని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పలు మీడియా వర్గాలతో చెప్పారు. ప్రస్తుతం తమ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు చెప్పారు. ఈ సినిమా గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. రాక్షస్ టైటిల్ కన్ఫర్మ్ అని కూడా సమాచారం.

మరోవైపు, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. మూవీని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసినప్పుడు.. స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ గ్లింప్స్ కోసమే ప్రస్తుతం షూట్ చేస్తున్నారట. ఈ స్పెషల్ షెడ్యూల్ కోసం రణ్ వీర్ సింగ్ నాలుగు రోజులు కేటాయించినట్లు తెలుస్తోంది.

ఇక త్వరలో తండ్రి కానున్న రణ్ వీర్ సింగ్.. ప్రస్తుతం దీపికా పదుకొణెతో ఎక్కువ సమయం గడుపుతున్నారని సమాచారం. రీసెంట్ గా దీపిక బేబీ బంప్ తో ఓటు వేసేందుకు వచ్చి కనిపించింది. డాన్ 3, శక్తిమాన్ లాంటి సినిమాలు రణ్ వీర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. ఆదిత్య ధర్ తో కూడా మరో మూవీ చేయనున్నట్లు సమాచారం. మరి ప్రశాంత్ వర్మతో రణ్ వీర్ చేయనున్న సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.