Begin typing your search above and press return to search.

వీడియో : వింక్ బ్యూటీలో కొత్త కళ చూశారా...!

ఈ అమ్మడు హీరోయిన్‌ గా పాన్ ఇండియా రేంజ్ లో ఓ రేంజ్ కు వెళ్తుందని అంతా భావించారు.

By:  Tupaki Desk   |   6 March 2024 10:10 AM GMT
వీడియో : వింక్ బ్యూటీలో కొత్త కళ చూశారా...!
X

ముద్దు గన్ను పేల్చి, కన్ను గీటి వింక్ బ్యూటీగా సోషల్‌ మీడియాను ఏడాది పాటు కుదిపేసిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్‌. ఈ అమ్మడు హీరోయిన్‌ గా పాన్ ఇండియా రేంజ్ లో ఓ రేంజ్ కు వెళ్తుందని అంతా భావించారు. కానీ మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో పెద్దగా ఆఫర్లు రాలేదు.

చిన్నా చితక ఆఫర్లు వచ్చినా కూడా పెద్ద విజయాలను సొంతం చేసుకోలేదు. సోలో హీరోయిన్ గా ఆఫర్లు రావడం లేదు. అయినా కూడా సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా ఏదో ఒకటి పోస్ట్‌ చేస్తూ వైరల్‌ అవుతూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ వార్తల్లో నిలిచింది.

ఈసారి అందాల ఆరబోత ఫోటోలతో కాకుండా, బికినీ వీడియోలతో కాకుండా తన గానామృతంను వినిపించడం ద్వారా వైరల్‌ అయ్యింది. కమల్‌ హాసన్‌ సూపర్‌ హిట్ సాంగ్ కన్మనీ... ని పాడుతూ ప్రియా ప్రకాష్‌ వారియర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించడం తో పాటు, చాలా మంది మళ్లీ మళ్లీ వింటున్నారు.

అందంగా ఉండే ప్రియా ప్రకాష్ వారియర్‌ యొక్క వాయిస్‌ కూడా ఇంత అందంగా ఉంటుందని తాము భావించలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలవోకగా లిరిక్స్ ను పాడుతూ చాలా చక్కని ఎక్స్‌ప్రెషన్స్‌ తో ప్రియా అబ్బుర పరిచింది. ప్రియా ప్రకాష్ వారియర్ యొక్క సింగింగ్ వీడియోను మీరు ఒక లుక్కేయండి.