Begin typing your search above and press return to search.

దశాబ్ద కాలం తర్వాత ఆ ముగ్గురి పేర్లు మారుమ్రోగుతున్నాయి

కానీ ఈ మధ్య కాలంలో డియోల్‌ ఫ్యామిలీ గురించి అదేనండి బాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ ధర్మేంద్ర ఫ్యామిలీ గురించి పెద్దగా వినిపించడం లేదు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 2:30 AM GMT
దశాబ్ద కాలం తర్వాత ఆ ముగ్గురి పేర్లు మారుమ్రోగుతున్నాయి
X

బాలీవుడ్ అనగానే కపూర్‌ ఫ్యామిలీకి చెందిన హీరోలు, హీరోయిన్స్ మరియు ఖాన్‌ హీరోల గురించి ప్రస్తావన వస్తుంది. బచ్చన్ ఫ్యామిలీ గురించి కూడా బాలీవుడ్‌ మీడియాలో వార్తలు ప్రముఖంగా వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో డియోల్‌ ఫ్యామిలీ గురించి అదేనండి బాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ ధర్మేంద్ర ఫ్యామిలీ గురించి పెద్దగా వినిపించడం లేదు.

అమితాబచ్చన్ తో సమానమైన క్రేజ్ ని దక్కించుకోవడంతో పాటు, ఒకానొక సమయంలో బిగ్‌బిని మించి సినిమాలు చేసిన ఘనత ధర్మేంద్ర కి ఉంది అంటూ చాలా మంది అంటూ ఉంటారు. అలాంటి ధర్మేంద్ర తనయులు అయిన బాబీ డియోల్‌ మరియు సన్నీ డియోల్ లు ఇండస్ట్రీలో అడుగు పెట్టి హిట్ అయ్యారు. అయితే గత పదేళ్లుగా వారి గురించి పెద్దగా చర్చ లేదు.

ఈ ముగ్గురికి కూడా 2023 సంవత్సరం కలిసి వచ్చింది. తండ్రి ధర్మేంద్ర కి రాఖీ ఔర్ రాణికి ప్రేమ్‌ కహాని సినిమాలో మంచి పాత్ర దక్కింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులు ధర్మేంద్ర ను మళ్లీ స్క్రీన్‌ పై ఇలాంటి పాత్రలో చూసినందుకు చాలా సంతోషంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.

ఇక గదర్ తో సూపర్‌ హిట్ దక్కించుకున్న సన్నీ డియోల్‌ ఆ సినిమా కి సీక్వెల్‌ గా గదర్ 2 ని చేసి సెన్షేషనల్‌ సక్సెస్ ని దక్కించుకున్నాడు. బాలీవుడ్‌ టాప్‌ 10 సినిమాల్లో గదర్‌ 2 నిలిచింది అంటే ఏ స్థాయిలో ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకుందో చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.

డియోల్‌ ఫ్యామిలీ కే చెందిన మరో నటుడు బాబీ డియోల్‌. ఈయన యానిమల్‌ సినిమా లో విలన్ పాత్రలో నటించాడు. చాలా కాలం తర్వాత ఓ మంచి పాత్రలో నటించాను అంటూ ఆయన ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు. సినిమా విడుదల తర్వాత బాబీ డియోల్‌ సక్సెస్ ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే ఇన్నాళ్ల ఆయన ప్రయత్నాలు మరియు కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మొత్తానికి దశాబ్ద కాలంగా ఈ ఫ్యామిలీ కి చెందిన ముగ్గురు స్టార్స్ సైలెంట్‌ గా ఉన్నారు. 2023 లో ఒకే సారి ఆ ముగ్గురికి కూడా కలిసి రావడం కాకతాళీయం అయినా కూడా ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోష్ తో రాబోయే దశాబ్ద కాలం పాటు ఈ ముగ్గురు కూడా కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది.