Begin typing your search above and press return to search.

ఈ వారం ఒటీటీలో రిలీజ్ కాబోయేవి ఇవే

అలాగే పి వాసు దర్శకత్వంలో లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్ లో రిలీజ్ అయిన చంద్రముఖి 2 డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 8:39 AM GMT
ఈ వారం ఒటీటీలో రిలీజ్ కాబోయేవి ఇవే
X

ప్రతి వారం ఒటీటీలో సినిమాలు లేదంటే వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకి వస్తూనే ఉన్నాయి. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ కోసం ఈ వెబ్ సిరీస్ లు ఒటీటీ ఛానల్స్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వెబ్ సిరీస్ లు అందిస్తున్నారు. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా నాలుగు వారల గ్యాప్ లో ఒటీటీలోకి వస్తున్నాయి.

వచ్చే వారం ఒటీటీలో రిలీజ్ కాబోయే సినిమాల సంగతి చూసుకుంటే రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కి డిజాస్టర్ అయిన స్కంద మూవీ ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 27న డిస్నీ హాట్ స్టార్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రంలో శ్రీలీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించారు.

అలాగే పి వాసు దర్శకత్వంలో లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్ లో రిలీజ్ అయిన చంద్రముఖి 2 డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంలో ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడింది. మరి ఒటీటీ ఆడియన్స్ లో చంద్రముఖి 2 ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.

డిస్నీ హాట్ స్టార్ లో బాలీవుడ్ లో పాపులర్ రియాలిటీ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ గా ఈ షోని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. వివాదాలకి కేంద్రంగా ఈ షో భాగా పాపులర్ అయ్యింది. అక్టోబర్ 26 న ఈ టాక్ షో ప్రారంభం ప్రారంభం కాబోతోంది.

డాక్యుమెంటరీ సిరీస్ హాలీవుడ్ లో భాగా పాపులర్. వీటికి విపరీతమైన క్రేజ్ ఉంది. రియల్ లైఫ్ సంఘటనలని ఆవిష్కరిస్తూ లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ వెబ్ సిరీస్ ఉంటుంది. అక్టోబర్ 25 నుంచి ఈ డాక్యుమెంటరీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.