Begin typing your search above and press return to search.

సూర్యకాంతం పేరు వినగానే పరుగెత్తిన పనిమనిషి..

అలాంటి సూర్యకాంతం ఇంటికి పనిమనిషి కావాలని కాకినాడలో ఉంటున్న ఒక పెద్దింటి ఆవిడకు ఉత్తరం రాగా ఆమె తనకు తెలిసిన పనిమనిషిని ఒప్పించి ఆమెను చెన్నై అప్పటి మద్రాసు పంపించేందుకు రెడీ అయ్యింది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 2:30 AM GMT
సూర్యకాంతం పేరు వినగానే పరుగెత్తిన పనిమనిషి..
X

సూర్యకాంతం తెలుగు తెర మీద చెరిగిపోని సంతకం ఆమె. బ్లాక్ అండ్ వైట్ టైంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు ఆమె. గయ్యాలి పాత్రలను ఆమెను మించి చేసే వారే లేరు అనేలా ముద్ర వేసుకున్నారు సూర్యకాంతం. ఇప్పటికీ ఎవరైనా గయ్యాలి ప్రవర్తన చేస్తే సూర్యకాంతం తో పోల్చడం అలవాటే. అలాంటి సూర్యకాంతం ఇంటికి పనిమనిషి కావాలని కాకినాడలో ఉంటున్న ఒక పెద్దింటి ఆవిడకు ఉత్తరం రాగా ఆమె తనకు తెలిసిన పనిమనిషిని ఒప్పించి ఆమెను చెన్నై అప్పటి మద్రాసు పంపించేందుకు రెడీ అయ్యింది.

కాకినాడ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కించడానికి రాగా అక్కడ మరో వ్యక్తి ఆ పెద్దింటి ఆవిడని ఎటు వెళ్తున్నారని అడిగితే తాను కాదు సూర్యకాంతం ఇంట్లో పనిమనిషి కావాలంటే పంపిస్తున్నా అని అన్నదట. సినిమా వాళ్ల ఇంట్లో పనిమనిషి, జీతభత్యాలు, ప్రోత్సాహకాలు బాగుంటాయి అని చెప్పగానే ఎవరు ఏమిటి అని అడక్కుండానే పనిమనిషి మద్రాసు వెళ్లేందుకు సిద్ధమైందట. తీరా ట్రైన్ ఇంకొద్ది నిమిషాల్లో ఎక్కబోతుందని అంగా వెళ్లేది సూర్యకాంతం ఇంటికి అని తెలిసి కంగారు పడి సూర్యకాంతం ఇంట్లో వంట చెయ్యాలా అని పెట్టే బేడా సర్థుకుని ట్రైన్ దిగేసిందట.

సూర్యకాంతం అంటే అప్పట్లో అంత భయం ఉండేది. ఆమె స్క్రీన్ మీద అలా కనిపించినా సరే కేవలం అది సినిమాలో పాత్ర తప్ప ఆమె బయట చాలా బాగా ఉంటారని తెలిసిందే. ఆమెతో కలిసి పనిచేసిన వారంతా ఆమె సినిమాల్లో కనిపించే పాత్రకు ఆమె నిజ స్వరూపానికి వ్యత్సాహం ఉందని చెప్పారు. సినిమాలో వారు చేసి పాత్రలను బట్టి వారికి ఇమేజ్ రావడం బహుశా సూర్యకాంతం వల్లే జరిగింది.

సూర్యకాంతం తర్వాత ఆ రేంజ్ లో గయ్యాలి అత్త పాత్రలు ఎవ్వరు చేయలేకపోయారు. కొన్నాళ్లు తెలంగాణా శకుంతల ప్రయత్నించినా సరే సూర్యకాంతం రేంజ్ కి వెళ్లలేదు. తెలుగు తెర మీద సూర్యకాంతం తన మార్క్ వేశారు. హీరోలు హీరోయిన్స్ తో ఈక్వల్ గా అప్పట్లో సూర్యకాంతం కి స్పెషల్ క్రేజ్ ఉంది. ఆమె లేని సినిమా లేదన్నట్టుగా తన ఫాం కొనసాగించారు సూర్యకాంతం.