Begin typing your search above and press return to search.

ఆ డిజాస్టర్ ట్రోల్ సినిమాకు సీక్వెలా..?

ఈ మూవీ డిజాస్టర్ అయ్యి భారీ నష్టాలు తీసుకొచ్చింది. పెట్టిన పెట్టుబడిలో కనీసం 20 శాతం కూడా రికవరీ రాలేదు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 3:58 AM GMT
ఆ డిజాస్టర్ ట్రోల్ సినిమాకు సీక్వెలా..?
X

కోలీవుడ్ లో సోషల్ మీడియా సెన్సేషన్ శరవణన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శరవణన్ స్టోర్స్ ద్వారా వస్త్ర వ్యాపారంలో దూసుకుపోతున్న వ్యక్తి. అలాగే తన స్టోర్స్ కి హీరోయిన్స్ తో పాటు తానే ప్రచారకర్తగా ఉంటూ యాడ్స్ ద్వారా విపరీతమైన పాపులారిటీ పెంచుకున్నాడు. అతను హీరోగా ది లెజెండ్ అనే సినిమాని భారీ బడ్జెట్ తో సొంత నిర్మాణంలోనే చేశాడు.

ఈ మూవీ డిజాస్టర్ అయ్యి భారీ నష్టాలు తీసుకొచ్చింది. పెట్టిన పెట్టుబడిలో కనీసం 20 శాతం కూడా రికవరీ రాలేదు. అయిన కూడా హీరోగా ఎస్టాబ్లిష్ కావాలనే తన కోరికని శరవణన్ ఆపుకోలేదు. సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కథలు వింటున్నారు. అలాగే డిఫరెంట్ లుక్స్ తో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు.

ఆ మధ్యకాలంలో ఒక ప్రేమకథా చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ది లెజెండ్ సీక్వెల్ ని శరవణన్ సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడంట. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. గోకులం స్టూడియోలో ఈ నెల 22న ది లెజెండ్ 2 కి సంబందించిన ఫోటోషూట్ జరగబోతోందని సమాచారం.

ఈ సినిమాకి ధనుష్ తో కోడి సినిమాని చేసిన దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తారంట. అలాగే టాప్ సినిమాటోగ్రాఫర్ వెంకటేష్ కెమెరామెన్ గా చేయనున్నారని తెలుస్తోంది. మొదటి సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ మూవీ ఉంటుందంట. స్టార్ హీరోయిన్స్ ని శరవణన్ కి జోడీగా మూవీలో ఎంపిక చేయబోతున్నారు అనే ప్రచారం నడుస్తోంది.

ది లెజెండ్ తరహాలోనే స్టార్ క్యాస్టింగ్ కూడా మూవీలో ఉంటారంట. ది లెజెండ్ మూవీ స్టార్ట్ కాబోతుందని హీరో కమ్ ప్రొడ్యూసర్ శరవణన్ స్వయంగా ప్రకటించడం విశేషం. మరి ఈ సినిమా అయిన అతనికి హీరోగా మంచి పేరు తీసుకొని వస్తుందేమో వేచి చూడాలి. అఫీషియల్ గా మూవీని ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.