Begin typing your search above and press return to search.

లేడీకిల్లర్ ట్రైలర్: అత‌డు ఆమె విధ్వంసకర ప్రేమ

ట్రైలర్ లో హత్య చేసి రక్త‌పుమ‌ర‌క‌లు క‌నిపించ‌కుండా మేనేజ్ చేసే ప్ర‌మాద‌క‌ర అమ్మాయిగా భూమి క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:26 AM GMT
లేడీకిల్లర్ ట్రైలర్: అత‌డు ఆమె విధ్వంసకర ప్రేమ
X

అర్జున్ కపూర్-భూమి పెడ్నేకర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'ది లేడీకిల్లర్' ట్రైలర్ విడుద‌లైంది. ట్రైల‌ర్ ఆద్యంతం అనైతిక సంబంధం విధ్వంశం గ‌గుర్పాటుకు గురి చేస్తోంది. ఈ చిత్రం క‌థాంశం థ్రిల్ క‌లిగిస్తోంది. అత్యంత‌ ప్రమాదకరమైన మహిళ (భూమి పెడ్నేక‌ర్) వ‌ల్లో ప‌డే ఒక స్మాల్ టౌన్ ప్లేబాయ్ గా ఇందులో అర్జున్ క‌పూర్ నటించాడు. ఈ జంట క‌ల‌యిక ప్ర‌మాదాల‌కు దారి తీస్తుంది.

అర్జున్ ఒక‌ మాజీ మహారాజును కలవడానికి రాజుగారి బంగ్లా గుమ్మం వద్దకు రావడంతో ట్రైల‌ర్ ప్రారంభమవుతుంది. అయితే భూమి పెడ్నేక‌ర్ అతడిని తలుపు వద్ద పలకరిస్తుంది. వారి న‌డుమ‌ ఉద్వేగభరితమైన ప్రేమ వేళ్ళూనుకుంటుంది. కథ విప్పే క్ర‌మంలో భూమి ఒరిజినాలిటీ ఏమిట‌నేది అర్జున్ గుర్తిస్తాడు.

ఇది వారి సంబంధంలో ప్రమాదకరమైన - విధ్వంసకర‌మైన‌ మలుపున‌కు దారి తీస్తుంది. ట్రైలర్ లో హత్య చేసి రక్త‌పుమ‌ర‌క‌లు క‌నిపించ‌కుండా మేనేజ్ చేసే ప్ర‌మాద‌క‌ర అమ్మాయిగా భూమి క‌నిపిస్తోంది.

'ది లేడీకిల్లర్‌'ని అత్యంత ఎమోషనల్ రైడ్ గా ఉంటుంద‌ని అర్జున్ క‌పూర్ చెబుతున్నాడు. ''నేను ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌పడి ప‌ని చేసాను. మెంటల్‌గా ఎమోషనల్‌గా భూమికి - నాకు సినిమా చాలా ఘాటైన అనుభ‌వం. ప్రేమకథ కోణంలో ఇది చాలా వాస్తవమైనది. అందుకే నేను షూటింగ్ పూర్త‌యాక సుదీర్ఘ సెలవుపై దూరంగా వెళ్లాను. ఆ సినిమా కోసం దాదాపు 45 రోజులు షూట్ చేసి, విరామం కోసం వెళ్లిపోయాను. నేను ఆ ప్లేస్ నుంచి బయటకు రావాలి కాబ‌ట్టే అలా చేసాను'' అన్నారు.

BA పాస్, సెక్షన్ 375, బ్లర్ వంటి చిత్రాలతో పాపుల‌రైన దర్శకుడు అజయ్ బహ్ల్ ది లేడీకిల్లర్‌ని తెర‌కెక్కించారు. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు ఈ మూవీ గురించి రివీల్ చేసారు. భూమి- అర్జున్‌లతో కలిసి పనిచేసిన అనుభవాన్ని అజ‌య్ షేర్ చేసుకున్నారు. లేడీకిల్లర్ నవంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది.