Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ డే కలెక్షన్స్ @ రూ.38 వేలు.. ఆ ఫ్యామిలీ పరువు పోయే

బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ది లేడీ కిల్లర్ సినిమా మొదటి రోజు కేవలం రూ.38 వేల రూపాయల వసూళ్లు నమోదు చేసింది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:48 AM GMT
ఫస్ట్‌ డే కలెక్షన్స్ @ రూ.38 వేలు.. ఆ ఫ్యామిలీ పరువు పోయే
X

ఈ మధ్య కాలంలో ఎంత చిన్న సినిమా అయినా కూడా దాని ఫలితాన్ని బట్టి పదుల కోట్ల నుంచి వంద కోట్ల వరకు వసూళ్లు రాబడుతూనే ఉంది. సౌత్ లో చిన్న సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా ఒకప్పుడు మినిమం వసూళ్లు కోట్లలోనే ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

తాజాగా వచ్చిన ది లేడీ కిల్లర్ సినిమా కి వచ్చిన వసూళ్లు మొత్తం బాలీవుడ్ పరువు తీసే విధంగా ఉన్నాయి. మొన్న శుక్రవారం విడుదల అయిన ది లేడీ కిల్లర్ సినిమాలో ప్రముక బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్ నటించాడు. ఆయనకు జోడీగా భూమి పెడ్నేకర్ నటించింది. అజయ్ బహ్ల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వకుండానే విడుదల చేయాల్సి వచ్చింది. షూటింగ్‌ పూర్తి కాకుండా విడుదల చేయడం వల్ల సినిమా చెత్తగా ఉందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా కూడా ఫస్ట్‌ డే.. ఫస్ట్ షో కి అయినా మినిమం వసూళ్లు నమోదు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమా కు అది కూడా లేదు.

బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ది లేడీ కిల్లర్ సినిమా మొదటి రోజు కేవలం రూ.38 వేల రూపాయల వసూళ్లు నమోదు చేసింది. దేశం మొత్తం కూడా ఈ సినిమాకి గాను మొదటి రోజు 300 లోపు టికెట్లు తెగినట్లు తెలుస్తోంది. కపూర్‌ ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాకు ఇంత దారుణమైన నెంబర్స్ నమోదు అవ్వడం విచిత్రం. కపూర్‌ ఫ్యామిలీ పరువు తీశారు అంటూ ది లేడీ కిల్లర్ టీం మెంబర్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

షూటింగ్ పూర్తి చేయకుండా సినిమాను విడుదల చేయడం ఏంటో అంటూ మేకర్స్ పై విమర్శలు చేస్తూ ఉంటే మరి కొందరు ఇంత మాత్రానికి థియేటర్‌ రిలీజ్ ఎందుకు.. ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసి ఉంటే సరి పోయేది అంటూ పెదవి విరుస్తున్నారు. పెట్టిన బడ్జెట్‌ చాలా చాలా తక్కువ... ఆ బడ్జెట్‌ లో కూడా కనీసం 10 శాతం రికవరీ చేయలేక పోవడం ను బట్టి ఆ సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.