Begin typing your search above and press return to search.

రామ్‌ చరణ్‌ తో నిఖిల్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడుగా..

తాజాగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో సినిమా కోసం మూవీ టీం ఎంత రీసెర్చ్ చేస్తుందో చూపించారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 12:00 PM GMT
రామ్‌ చరణ్‌ తో నిఖిల్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడుగా..
X

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ది ఇండియా హౌస్. అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. బ్రిటిష్ రూలింగ్ సమయంలో ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది.. బ్రిటిష్ గడ్డ పై ఏర్పాటు చేసిన గూఢచారి సమావేశం గృహమే ఇండియన్ హౌస్. ఆ హౌస్ నేపథ్యంతో ఈ మూవీ కథ సాగబోతోంది.

ఇక అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ను తెరకెక్కించబోతున్నారు. ఈక్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను పక్కాగా చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో సినిమా కోసం మూవీ టీం ఎంత రీసెర్చ్ చేస్తుందో చూపించారు. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ పై తీయనున్నారని తెలుస్తుంది. అందుకోసం ప్రీ విజవలైజేషన్ వీడియోను క్రియేట్ చేసి ముందుగానే నటీనటులకు ట్రైనింగ్ ఇస్తున్నారు.

ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వీడియో మూవీ పై మరింత అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఇక ఇది చూసిన నెటిజన్లు రామ్‌ చరణ్‌ తో నిఖిల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ కొత్త వారిని, కొత్త టాలెంట్ ను యంకరేజ్ చేయడానికి స్థాపించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం దాదాపు చాలావరకు కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ ఒక ఆడిషన్ నోటీసు రిలీజ్ చేశారు. 8000 పైగా అప్లికేషన్స్ వచ్చాయట. వారిలో దాదాపు 500 పైగా ఎంపిక చేశారట. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి. ప్రస్తుతం నిఖిల్.. స్వ యంభు అనే సినిమా చేస్తున్నారు.