Begin typing your search above and press return to search.

లాంచింగ్ కంటే ముందే హైప్ కోసం అలా!

సినిమా ప్రారంభానికి ముందే అనౌన్స్ మెంట్ వీడియోల‌తో సినిమాని ముందుగానే జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 2:30 AM GMT
లాంచింగ్ కంటే ముందే హైప్ కోసం అలా!
X

సినిమా ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ మారిందా? కుర్రాళ్లు కొత్త స్ట్రాట‌జీతో మందుకెళ్తున్నారా? సినిమా లాంచింగ్ కంటే ముందే హైప్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఒక‌ప్పుడు సినిమా ప్రారంభ‌మైన త‌ర్వాతే ఆ సినిమా విశేషాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌చ్చేవి. ఆ త‌ర్వాత సెట్స్ నుంచి షూటింగ్ అప్ డేట్స్ మేక‌ర్స్ రివీల్ చేసేవారు. అయితే ఇప్పుడా త‌ర‌హా ప్ర‌చారం పాత‌దైంది.

కొత్త త‌రం ద‌ర్శ‌కులంతా కొత్త స్ట్రాట‌జీతో ముందుకెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. సినిమా ప్రారంభానికి ముందే అనౌన్స్ మెంట్ వీడియోల‌తో సినిమాని ముందుగానే జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా సిద్దు జొన్న‌ల గ‌డ్డ హీరోగా న‌టిస్తున్న 'తెలుసుక‌దా' అనౌన్స్ మెంట్ వీడియో తో ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంతో స్టార్ రైట‌న్ రైట‌ర్ కొన వెంక‌ట్ కుమార్తె నీర‌జ ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌వుతుంది.

అలాగే సంప‌త్ నంది సాయితేజ్ తో 'గాంజా శంక‌ర్' తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రారంభానికి ముందే ఓ వీడియో తో ముందుకొచ్చారు. అలాగే కింగ్ నాగార్జున నటిస్తున్న 'నాసామీరంగ' కూడా ఇంతే. నాగ్ లుక్ సైతం ఎలా ఉంటుంద‌న్న‌ది ముందుగానే రివీల్ చేసారు. అంత‌కు ముందు విక్ర‌మ్ హీరోగా న‌టించిన `మ‌ల్ల‌న‌`కి ఇలాగే చేసారు. ఇంకా ముందుకెళ్తే క‌మ‌ల్ హాస‌న్..చిరంజీవి సినిమాల‌కు ఇది జ‌రిగింది.

అయితే అప్పుడు విధానం పెద్ద‌గా పాపుల‌ర్ కాలేదు. తాజాగా కొత్త కుర్రాళ్లు చేస్తోన్న వినూత్న ప్ర‌య‌త్నం యువ‌తికి బాగా కనెక్ట్ అవుతుంది. సోష‌ల్ మీడియా పూర్తి స్థాయిలో కి వినియోగంలోకి రావ‌డంతో ఈర‌క‌మైన ప్ర‌చారం ప్రారంభానికి ముందు ఓ ర‌క‌మైన బ‌జ్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ వీడియోలు యూనిక్ గా..ఎగ్జైట్ మెంట్ తీసుకొచ్చేలా ఉండాలి. అందులో ఎక్క‌డ తేడా జ‌రిగిన సినిమాపై మొద‌టి వీడియో తోనే నెగిటివ్ ఇంప్రెష‌న్ ప‌డిపోతుంది. అలాగే ఈ మ‌ధ్య కాలంలో సినిమా పూర్త‌యిన త‌ర్వాత ప‌బ్లిసిటీ కూడా ఇన్నో వేటివ్ గా చేస్తున్నారు. రొటీన్ గా చేస్తే కిక్కే ముందు..కొత్త‌గా చేస్తే మ‌జా ఉంద‌ని భావించి మేక‌ర్స్ ఎవ‌రి ట్యాలెంట్ వారు చూపిస్తున్నారు.