Begin typing your search above and press return to search.

నిర్మాత క‌ష్టాలు చెప్పిన హీరోయిన్!

ఓటీటీ లాంటి ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉండ‌టంతో కంటెంట్ ని మార్కెట్ డిమాండ్ ని బ‌ట్టి విక్ర‌యిం చ‌డం..అందు లో లాభ‌న‌ష్టాలు ఇలా అన్నింటి గురించి తెలుసుకుంది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 3:00 AM GMT
నిర్మాత క‌ష్టాలు చెప్పిన  హీరోయిన్!
X

హీరోయిన్ కం నిర్మాత‌గా రాణిస్తోంది తాప్సీ ప‌న్ను. అమ్మ‌డు బాలీవుడ్ జ‌ర్నీని డిఫ‌రెంట్ గా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది. తొలుత హీరోయిన్ గా అక్క‌డ సినిమాలు చేస్తూ బిజీ అయింది. అటుపై నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ప‌రిమిత బ‌డ్జెట్ లో సినిమాలు నిర్మించ‌డం మొద‌లు పెట్టింది. ఓటీటీ లాంటి ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉండ‌టంతో కంటెంట్ ని మార్కెట్ డిమాండ్ ని బ‌ట్టి విక్ర‌యిం చ‌డం..అందు లో లాభ‌న‌ష్టాలు ఇలా అన్నింటి గురించి తెలుసుకుంది.

తాజాగా చిన్న సినిమాల నిర్మాణం ఎలా ఉంటుంది? ఓటీటీలో రిలీజ్ చేస్తే వాటి ప‌రిస్థితి ఏంటి? హిట్ కంటెట్ కి మార్కెట్ లో ఎలాంటి డిమాండ్ ఉంటుంది? ప్లాప్ అయితే ప‌రిస్థితి ఏంటి? వంటి అంశాల‌పై తాప్సీ త‌న అనుభ‌వాల్ని షేర్ చేసుకుంది. ఆవేంటో ఆమె మాట‌ల్లోనే. `చిన్న బ‌డ్జెట్ సినిమాలు ఓటీటీ ద్వారా కేవ‌లం నిర్మాణ వ్యయాన్ని మాత్ర‌మే రిక‌వ‌రీ చేస్తున్నాయి. అలా ఓటీటీలోకి తీసుకెళ్లాల‌న్నా ముందుగా పబ్లిసిటీ చేయాలి. ఆ ఖ‌ర్చు అద‌నంగా నిర్మాత చూసుకోవాలి.

ఆ ఖ‌ర్చులు తిరిగి రావ‌డం లేదు. నేరుగా ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేసిన‌ట్లు అయితే స్టార్లు లేనందున వాటిపై ఆసక్తి ఉండ‌టం లేదు. ప్ర‌చారం కూడా రావ‌డం లేదు. రిస్క్ చేసి థియేటర్లలో రిలీజ్ చేద్దాం అనుకున్నా సరైన రిలీజ్ కూడా క‌ష్ట‌మ‌వుతుంది. అందువ‌ల్ల అలాంటి సినిమాల‌కు ఏమాత్రం గుర్తింపు ఉండ‌టం లేదు. చివ‌రికి సినిమా పై ప్లాప్ అనే ముద్ర ప‌డుతుంది. పైగా ఆ సినిమాలు ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ లో విడుదలవుతాయి. థియేట‌ర్లో హిట్ అయిన సినిమానే ఓటీటీలోనే చూస్తున్నారు.

నేరుగా ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు కంటెంట్ బాగున్నా స్టార్లు లేక రీచ్ అవ్వ‌డం లేదు. జవాన్ లాంటి పెద్ద సినిమా జనాలు థియేట‌ర్‌లో చూసేందుకు ఇష్ట‌ప‌డ్డారు. ఓటీటీలో కూడా సాలిడ్ రెస్పాన్స్ వ‌స్తుంది. కానీ చిన్న -మధ్యతరహా బడ్జెట్ చిత్రాలకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై పుష్ దొక‌డం లేదు. ఓటీటీలో కంటున్యూగా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి.

అవి ప్రేక్షకులకు చేరువ కావాలంటే ఆ సినిమా లకు మంచి ఊపు రావాలి. అది తీసుకురావ‌డం అన్న‌ది చాలా క‌ష్ట‌మైన ప‌నిగానే మారింది` అని అన్నారు.ఇటీవలే తాప్సీ `ధక్ ధక్` అనే చిత్రాన్ని నిర్మించింది. ఇందులో ఫాతిమా సనా షేక్- దియా మీర్జా - సంజన సంఘీ నటించారు. కానీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. దీంతో న‌ష్టాలు త‌ప్ప‌లేదు.