Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ ఇంట్లో హీరోయిన్!నేరేష‌న్ ఏదైనా ఇచ్చాడా?

అదెప్పుడు ప‌ట్టాలెక్కుతుంది? అన్న‌ది తెలియ‌దు గానీ స్క్రిప్ట్ ప‌నులు మాత్రం చాలా సీరియ‌స్ గానే పూర్తి చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 2:30 AM GMT
డైరెక్ట‌ర్ ఇంట్లో హీరోయిన్!నేరేష‌న్ ఏదైనా ఇచ్చాడా?
X

'జ‌వాన్' తో అట్లీ పాన్ ఇండియా మేక‌ర్ గా ఫేమ‌స్ అయ్యాడు. ఏకంగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కే భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందించి మ‌రోసారి బాలీవుడ్ జ‌నాలు సౌత్ ట్యాలెంట్ గురించి ముచ్చ‌టించుకునేలా చేసాడు. ఇప్పుడు అట్లీతో సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ స్టార్లు సైతం క్యూలో ఉన్నారు. కానీ అట్లీ ప్లాన్ మ‌రోలా ఉంది. షారుక్ ఖాన్--త‌ల‌ప‌తి విజ‌య్ ల్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. అదెప్పుడు ప‌ట్టాలెక్కుతుంది? అన్న‌ది తెలియ‌దు గానీ స్క్రిప్ట్ ప‌నులు మాత్రం చాలా సీరియ‌స్ గానే పూర్తి చేస్తున్నాడు. షారుక్ నుంచి ఇప్ప‌టికే గ్రీన్ సిగ్నెల్ వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. నువ్వు ఒకే చెబితే నేను వ‌చ్చేయ‌డానికి రెడీగా ఉన్నానంటూ ఖాన్ బాయ్ సిద్దంగా ఉన్నారు. దీంతో అట్లీ కూడా అంతే సీరియ‌స్ గా ప‌నిచేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా అట్లీ ఇంట్లో హీరోయిన్ పూజాహెగ్డే క‌నిపించింది.

దీంతో అట్లీ ఇంట్లో పూజాహెగ్డే ఏంటి? అని నెట్టింట వాడి వేడి చ‌ర్చ మొద‌లైంది. ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు తె ర‌పైకి వ‌స్తున్నాయి. త‌న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నాడా? అందుకే ఇంటికి పిల‌పించి త‌న కు ఇవ్వాల్సిన నేరేష‌న్ ఏదైనా ఇచ్చాడా? లేక ఇద్దరి మ‌ధ్య ఉన్న స్నేహం కార‌ణంగా అట్లీ ఆహ్వానం మేర‌కు ఇంటికెళ్లిందా? అంటూ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. పూజాహెగ్డే కోలీవుడ్ తో అత్యంత స‌న్నిహితంగా తొలి నుంచి మెలుగుతుంది.

కోలీవుడ్ సినిమాలేవైనా వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌గా తీసుకుని ప్ర‌చారం చేస్తుంటుంది. అక్క‌డి వాళ్ల‌తో మంచి ర్యాపో ని మెయింటెన్ చేస్తుంది. ఆర‌కంగా అట్లీతో స్నేహం చాలా కాలం క్రిత‌మే మొద‌లైన‌ట్లు తెలుస్తోంది.

ఇంత వ‌ర‌కూ పూజాహెగ్డే అట్లీ డైరెక్ట‌ర్ చేసిన ఏ సినిమాలోనూ న‌టించ‌లేదు. ఒక‌వేళ షారుక్ సినిమాకి బుట్ట‌బొమ్మ‌ని తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నాడా? అన్న‌ది తెలియాలి.