Begin typing your search above and press return to search.

హీరోల వార‌సులేనా నిర్మాత‌ల వార‌సులు కూడా అద‌ర‌గొట్టేస్తున్నారు!

ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య నిర్మాత‌ల వార‌సులు ఎక్కువ‌గా న‌టులుగా, హీరోలుగా అరంగేట్రం చేసి అద‌ర‌గొడుతున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 11:53 AM GMT
హీరోల వార‌సులేనా నిర్మాత‌ల వార‌సులు కూడా అద‌ర‌గొట్టేస్తున్నారు!
X

టాలీవుడ్‌లో హీరోల వార‌సులు తెరంగేట్రం చేయ‌డం, హీరోలుగా రాణించ‌డం చూశాం. ఇప్పుడు నిర్మాత‌ల వార‌సులు క్ర‌మ క్ర‌మంగా ఎంట్రీ ఇస్తూ హీరోలుగా రాణిస్తున్నారు. కొంత మంది ఇత‌ర క్యారెక్ట‌ర్‌ల‌లో అద‌ర‌గొడుతుంటే మ‌రి కొంత మంది మాత్రం హీరోలుగా ఆక‌ట్టుకుంటూ త‌మ స‌త్తా చాటుకుంటున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ నుంచి నిన్న‌టి విక్రాంత్ క‌ర్ణ వ‌ర‌కు చాలా మంది నిర్మాత‌ల వార‌సులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్ప‌టికీ మ‌రి కొంత మంది వార‌సులు అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు.

డి.రామానాయుడు త‌న‌యుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంక‌టేష్ టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రిగా నిలిచారు. ఇప్ప‌టికీ త‌న‌దైన మార్కు సినిమాలు చేస్తూ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. ఇదే త‌ర‌హాలో చాలా మంది నిర్మాత‌ల వార‌సులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వాళ్ల‌లో రామ్ కూడా ఒక‌రు. డైరెక్ట‌ర్ల త‌న‌యులు కూడా చాలా మందే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. హీరోలుగా త‌మ‌ని తాము నిరూపించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య నిర్మాత‌ల వార‌సులు ఎక్కువ‌గా న‌టులుగా, హీరోలుగా అరంగేట్రం చేసి అద‌ర‌గొడుతున్నారు. ఇటీవ‌ల `పెద‌కాపు` సినిమాతో విక్రాంత్ క‌ర్ణ ప‌రిచ‌యం కాగా మ‌రో నిర్మాత అభిషేక్ నామా వార‌సులు దేవాన్ష్, అనిరుధ్ చైల్ట్ ఆర్టిస్ట్‌లుగా అరంగేట్రం చేస్తున్నారు. వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన ఎమోష‌న‌ల్ మూవీ `ప్రేమ విమానం`. సంగీత్ శోభ‌న్‌, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ సినిమాలో దేవాన్ష్, అనిరుధ్‌ల‌కు ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర‌లు ద‌క్కాయి. అనిరుధ్ నామాకు ఈ సినిమాతో మంచి పేరుతో పాటు గుర్తింపు ల‌భిస్తుంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. చాలా క్యూట్‌గా, అద్భుత‌మైన న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించ‌డంతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవుతాడ‌ని అంతా అంటున్నారు. ప్రీమియ‌ర్ షోల‌ని ప్ర‌ద‌ర్శించారు. ఈ షోల‌ల్లో అనిరుధ్ నామా అంద‌రిలో హాట్ టాపిక్‌గా నిలిచాడు.