Begin typing your search above and press return to search.

ఆ సినిమాలో అంత మ్యాటర్ ఉందా..?

కుమారి 21f తో యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ తర్వాత ఎందుకో కెరీర్ ని స్ట్రాంగ్ చేసుకోవడంలో వెనకబడింది

By:  Tupaki Desk   |   13 Oct 2023 5:27 AM GMT
ఆ సినిమాలో అంత మ్యాటర్ ఉందా..?
X

కుమారి 21f తో యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ తర్వాత ఎందుకో కెరీర్ ని స్ట్రాంగ్ చేసుకోవడంలో వెనకబడింది. సినిమాల పరంగా ఏ ఛాన్స్ వచ్చినా కాదనకుండా చేస్తూ వచ్చిన హెబ్భా పటేల్ కొన్ని సినిమాల్లో అయితే అసలేమాత్రం ప్రాముఖ్యత లేని పాత్రల్లో నటించింది. అంతేకాదు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించింది. అయితే ఓటీటీ ప్రభావం వల్ల హెబ్భా కి అవకాశాలు వస్తున్నాయి.

లేటెస్ట్ గా హెబ్భా పటేల్ ఆహా ఓటీటీలో గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమాకు భారీ వ్యూస్ వస్తున్నాయంటూ ఆహా ప్రమోట్ చేస్తుంది. ఆత్మహత్యల మీద సెటైర్ వేసేలా ఈ సినిమా తెరకెక్కింది. ఢిల్లీలో జరిగిన బురారీ మరణాల సంబంధించి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లు చేసిన డాక్యుమెంటరీస్, వెబ్ సీరీస్ లు చూసిన వారికి ఇదొక కామెడీగానే అనిపిస్తుంది. గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా కథ కూడా బురారీ మరణాలను తీసుకుని హెబ్భా పటేల్ పాత్రకు ప్రాముఖ్యత ఏర్పరిచాడు దర్శకుడు.

ఈ సినిమా కొంత పార్ట్ ఆసక్తికరంగా సాగినా కొన్ని సీన్స్ మాత్రం బోరింగ్ గా అనిపిస్తాయి. యావరేజ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆహా లో మంచి రెస్పాన్స్ వచ్చినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకు ఆ రేంజ్ వ్యూస్ రావడం గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. హెబ్భా పటేల్ వల్లే ఈ సినిమాకు ఈమాత్రం అటెన్షన్ ఏర్పడింది. అదీగాక ఈ వీకెండ్ ఆశించిన స్థాయిలో థియేటర్ లో సినిమాలు లేకపోవడం వల్ల కూడా ఆహా సబ్ స్క్రైబర్స్ హెబ్భా పటేల్ నటించిన గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమాని చూస్తున్నారని అంచనా వేయొచ్చు.

హెబ్భా పటేల్ సినిమాకు ఈ మాత్రం రెస్పాన్స్ వచ్చింది అంటే ఆమెకు ఓటీటీలో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఆహా లో ఇప్పటికే చాలా వెబ్ సీరీస్ లు చేసిన హెబ్బా పటేల్ గ్రేట్ ఇండియన్ సూసైడ్ వల్ల కచ్చితంగా ఆమెను మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసిందని చెప్పొచ్చు. సినిమాల్లో ఎలాగు అవకాశాలు లేని టైం లో హెబ్భా కు ఓటీటీ లే ఆమె కెరీర్ ని నిలబెట్టేలా చేశాయి. ఓటీటీలో ఫలితాలు ఎలా ఉన్నా రెగ్యులర్ గా ఛాన్స్ లు మాత్రం వస్తుంటాయి.