Begin typing your search above and press return to search.

రెహమాన్ గోట్ లైఫ్.. ఏంటీ మ్యాటర్?

మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Feb 2024 12:30 PM GMT
రెహమాన్ గోట్ లైఫ్.. ఏంటీ మ్యాటర్?
X

మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల సలార్ లో ప్రభాస్ స్నేహితుడు వరదరాజ మన్నార్ గా తన నటనతో అదరగొట్టారు. మలయాళంలో ఎన్నో హిట్లు కొట్టిన ఆయన.. ప్రస్తుతం ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

గోట్ డేస్ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళంతోపాటు హిందీ, తెలుగు, తమళం, కన్నడలో మార్చి 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. లేటెస్ట్ గా ఈ మూవీ ఎక్స్ క్లూజివ్ వెబ్ సైట్ ను లాంఛ్ చేసింది మూవీ టీమ్. అందులో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తోపాటు అనేక వివరాలు పొందుపరిచింది. ఈ వెబ్ సైట్ లాంఛింగ్ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు బ్లెస్సీ, నవల రచయిత బెన్యామిన్ తదితరులు పాల్గొన్నారు.

మిస్టర్ బ్లెస్సీ, పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి పని చేయడం చాలా గౌరవంగా ఉందని ఏఆర్ రెహమాన్ తెలిపారు. వారు సినిమా కోసం చాలా కష్టపడ్డారని చెప్పారు. గోట్ లైఫ్ మూవీని వరల్డ్ క్లాసిక్ చిత్రం లారెన్స్ ఆఫ్ అరేబియాతో పోల్చారు. యోధ తర్వాత మళ్లీ మాలీవుడ్ సినిమా చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఒక రచయితగా ఇదొక మోస్ట్ మెమోరబుల్‌ మూమెంట్ అని గోట్ డేస్ నవల రచయిత బెన్యూమన్ తెలిపారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పారు. నా నవలను సినిమా రూపంలో బ్లెస్సీ తీర్చిదిద్దారని చెప్పారు. ప్రపంచంలోనే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి సంగీతం అందిచారన్నారు. ఇప్పటికే సినిమా చూశానని, అద్భుతంగా ఉందని తెలిపారు. రైటర్ గా చాలా గర్వంగా ఉందని చెప్పారు.

మలయాళం సినిమాల్లో ఇలా వెబ్ సైట్ ప్రారంభించడం చాలా రేర్ గా కనిపిస్తుందని డైరెక్టర్ బ్లెస్సీ చెప్పారు. చిత్రబందం అందించిన సహాయ సహకారాలను ప్రపంచానికి తెలియపరిచేందుకే వెబ్ సైట్ ప్రారంభించినట్లు తెలిపారు. వెబ్ సైట్ లో కనపడే ఎడారి.. పొద్దున్న ఒకలా సాయంత్రం ఒకలా కనిపిస్తుందని చెప్పారు. మ్యూజిక్ కు సంబంధించి ఎలా అనుమానాలు అక్కర్లేదని చెప్పారు.

ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, హీరోయిన్ అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్ రిక్ ఆబే తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్.. ఈ మూవీని ప్రతిష్టాతక్మంగా నిర్మించింది. మార్చి 10వ తేదీన ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరి పాన్ ఇండియా లెవెల్ ఈ మూవీ ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.