Begin typing your search above and press return to search.

ఆడు జీవితం - ది గోట్ లైఫ్.. ఎడారిలో భయంకర పోరాటం

కేవలం ట్రైలర్ లో ఒకే ఒక్క డైలాగ్‌తో మూవీపై మంచి ఫీలింగ్ కలిగించారు. పృథ్వీరాజ్ లుక్ షాకింగ్ గా ఉంది. తన కెరీర్ లోనే ఒక బెస్ట్ క్యారెక్టర్ గా నిలవనున్నట్లు అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   9 March 2024 12:23 PM GMT
ఆడు జీవితం - ది గోట్ లైఫ్.. ఎడారిలో భయంకర పోరాటం
X

మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇటీవల ప్రభాస్ సలార్ మూవీలో వరదరాజ్ మన్నార్ గా అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా మూవీ గోట్ లైఫ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఆడు జీవితం టైటిల్ తో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా కోసమే అప్పట్లో సలార్ షూటింగ్ ను పోస్ట్ పోన్ కూడా చేశారు పృథ్వీరాజ్.

అయితే ఆడు జీవితం మూవీకి అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తోపాటు మరికొందరు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఫేమస్ రైటర్ బెన్యామిన్ గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజర్, ట్రైలర్ వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

తాజాగా ఆడు జీవితం మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. పాత ట్రైలర్ సంగతి పక్కన పెడితే.. లేటెస్ట్ రిలీజ్ ట్రైలర్ మాత్రం కంప్లీట్ విజువల్ వండర్‌ లా అనిపిస్తోంది. లాంగ్ ఫ్రేమ్స్, క్లోజ్ ఫ్రేమ్స్‌ సీన్స్ మాత్రమే మేకర్స్ చూపించారు. కేవలం ట్రైలర్ లో ఒకే ఒక్క డైలాగ్‌తో మూవీపై మంచి ఫీలింగ్ కలిగించారు. పృథ్వీరాజ్ లుక్ షాకింగ్ గా ఉంది. తన కెరీర్ లోనే ఒక బెస్ట్ క్యారెక్టర్ గా నిలవనున్నట్లు అనిపిస్తోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ మేకోవర్, యాక్టింగ్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవల్ అని చెప్పవచ్చు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. ట్రైలర్‌ తో ఈ మూవీపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయని సినీ ప్రియులు చెబుతున్నారు. ఆడు జీవితం కోసం పదేళ్ల పాటు చాలా పరిశోధన చేసి కష్టపడ్డ దర్శకుడు బ్లెస్సీ మంచి ఫలితాన్ని తప్పకుండా దక్కించుకుంటారని అంటున్నారు.

ఈ మూవీ మార్చి 28వ తేదీన పాన్ ఇండియా రేంజ్‍ లో విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో రిలీజ్ అవ్వనుంది. దీంతో మేకర్స్.. ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 10వ తేదీ కొచ్చిలో మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.