Begin typing your search above and press return to search.

ది గర్ల్ ఫ్రెండ్.. రష్మిక ఫ్యాన్స్ గెట్ రెడీ

నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

By:  Tupaki Desk   |   31 March 2024 11:34 AM GMT
ది గర్ల్ ఫ్రెండ్.. రష్మిక ఫ్యాన్స్ గెట్ రెడీ
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప మూవీతో నేషనల్ క్రష్ ట్యాగ్ దక్కించుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో శ్రీవల్లిగా నటించి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

ఇటీవల యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ కు జోడీగా నటించి తన యాక్టింగ్ తో ఫిదా చేసింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్న రష్మిక.. కొన్ని రోజుల క్రితం షూటింగ్ అప్డేట్ ఇచ్చింది. దీంతోపాటు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా చేస్తోంది.

నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రష్మిక తో పాటు పలు పాపులర్ యాక్టర్లు ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రన్ ఎక్స్ లో తెలిపారు. దీంతో రష్మిక ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వెయిటింగ్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అప్డేట్ ఇవ్వండని ఇటీవల ఓ ఫ్యాన్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌ ను రిక్వెస్ట్ ట్వీట్ పెట్టారు. దానికి స్పందించిన రాహుల్.. ది గ‌ర్ల్ ఫ్రెండ్ టీజ‌ర్‌ ను ర‌ష్మిక బ‌ర్త్ డే అయిన ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో హీరోగా దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. రష్మిక బాయ్ ఫ్రెండ్ గా కనిపించనున్న దీక్షిత్ ఇంట్రో వీడియో ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఈ సినిమాను స్టార్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత రెయిన్ బో సినిమా కంప్లీట్ చేయనుంది రష్మిక. ఆ తర్వాత సందీప్ డైరెక్షన్ లో యానిమల్ పార్క్ లో నటించనుంది. మరి రష్మిక కొత్త చిత్రాలు ఎలా అలరిస్తాయో చూడాలి.