Begin typing your search above and press return to search.

గీతాంజ‌లి మ‌ధ్య‌లో గ్యాంగ్ ఏం చేస్తున్నారో?

ఇప్ప‌టికే న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అంజ‌లి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు సునీల్ ఫ‌స్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Jan 2024 9:01 AM GMT
గీతాంజ‌లి మ‌ధ్య‌లో గ్యాంగ్ ఏం చేస్తున్నారో?
X

తెలుగు హీరోయిన్ అంజ‌లి మ‌ళ్లీ `గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` అంటూ అల‌రించ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డికి 50వ చిత్రం కావ‌డం విశేషం. మ‌ళ్లీ అదే టీమ్ తో `గీతాంజ‌లి`కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో చేస్తోన్న ప్ర‌య‌త్నం ఇది. ఇప్ప‌టికే న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అంజ‌లి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు సునీల్ ఫ‌స్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.


వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మేక‌ర్స్ మ‌రో కొత్త పోస్ట‌ర్ ని లాంచ్ చేసారు. పోస్ట‌ర్‌లో పాడుబ డిన బిల్డింగ్‌లో అంజ‌లి.. శ్రీనివాస్‌ రెడ్డి.. సత్యం రాజేశ్‌.. షకలక శంకర్‌.. అలీ.. సునీల్ క‌నిపిస్తున్నారు. అంతా పైన ఉన్న దెయ్యాన్ని చూస్తూ భ‌య‌ప‌డుతున్న స‌న్నివేశానికి సంబంధించిన పోస్ట‌ర్ ఇది. అంజ‌లి చేతుల్లో ఓ పాప‌ బొమ్మ కూడా ఉంది. ఆ బొమ్మ వెనుక ఏదో చ‌రిత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

పోస్ట‌ర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమాలో కామెడీ స్టార్లు అంతా ఉండ‌టంతో హాస్యాన్ని కొద‌వ ఉండ‌ద‌ని తెలుస్తోం ది. హార‌ర్ కామెడీల‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. పైగా ఈ జాన‌ర్ సినిమాలు ఈ మ‌ధ్య కాలం లో రాలేదు. ఈ నేప‌థ్యంలో ఆ లాజిక్ కూడా సినిమాకి ప్ల‌స్ అవుతుంది. సినిమాకి మంచి బ‌జ్ క్రియేట్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ఈ చిత్రానికి కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లేను అందించ‌డంతో పాటు స‌మ‌ర్ప‌కుడిగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్ పై ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తు న్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. దీన్ని పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్ష‌కుల ముంద‌కు తీసుకురానున్నారు.