Begin typing your search above and press return to search.

'గేమ్ చేంజర్‌' లో గేమ్‌ చేంజింగ్ సీన్‌ అదేనట!

సినిమా అప్పటి వరకు సాగిన తీరుకు, ఇంటర్వెల్‌ సమయం లో తీసుకునే ట్విస్ట్‌ తో సెకండ్‌ హాఫ్ పై విపరీతమైన ఆసక్తి, అంచనాలు పెరిగేలా ఉంటుందట.

By:  Tupaki Desk   |   30 Oct 2023 11:30 PM GMT
గేమ్ చేంజర్‌ లో గేమ్‌ చేంజింగ్ సీన్‌ అదేనట!
X

రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్‌ చేంజర్ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో అంజలి, శ్రీకాంత్, సునీల్ ఇంకా పలువురు ముఖ్య నటీ నటులు నటించబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే.

దర్శకుడు శంకర్‌ సినిమాల్లో భారీతనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతే కాకుండా సినిమా ఇంటర్వెల్‌ సమయంలో హీరోయిజం చూపించే ట్విస్ట్‌ ను అద్భుతంగా చూపించడం కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. గేమ్‌ చేంజర్ మూవీ లో కూడా ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సినిమా స్థాయిని అమాంతం మార్చే విధంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినిమా అప్పటి వరకు సాగిన తీరుకు, ఇంటర్వెల్‌ సమయం లో తీసుకునే ట్విస్ట్‌ తో సెకండ్‌ హాఫ్ పై విపరీతమైన ఆసక్తి, అంచనాలు పెరిగేలా ఉంటుందట. అంతే కాకుండా కథ లో ముందుకు వెళ్తున్న సమయంలో వచ్చే ట్విస్ట్‌ అవ్వడంతో సెకండ్‌ హాఫ్ లో ఏం జరుగబోతుందా అంటూ కుర్చీ ల చివర్లోకి వచ్చి మరీ ప్రేక్షకులు ఉత్కంఠత తో ఎదురు చూసే విధంగా ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి రామ్ చరణ్ గేమ్‌ చేంజర్ సినిమాలో కథ లో గేమ్‌ చేంజింగ్ పాయింట్‌ ఇంటర్వెల్‌ సమయంలో వస్తుందట. ఈ సినిమా లో రామ్‌ చరణ్‌ ను యంగ్‌ లుక్ తో పాటు, ఓల్డ్‌ లుక్ లో చూడబోతున్నాం. అంటే తండ్రి కొడుకులుగా చరణ్ ను చూడబోతున్నాం. అయితే రెండు పాత్రలను ఒకేసారి స్క్రీన్‌ పై చూస్తామా లేదా అనేది సినిమా విడుదలైన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

దిల్‌ రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శంకర్ ఈ సినిమా తో పాటు ఇండియన్ 2 సినిమాను కూడా చేస్తున్నాడు. రెండు సినిమాలు కూడా కొద్ది తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.