Begin typing your search above and press return to search.

ప్ర‌చారంలో పిస్తా ఫ్యామిలీ స్టార్

ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 March 2024 4:45 PM GMT
ప్ర‌చారంలో పిస్తా ఫ్యామిలీ స్టార్
X

విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ నటించిన `ఫ్యామిలీ స్టార్` ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతున్నందున అభిమానులలో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల నాయ‌కానాయిక‌లు ముంబైలో ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సినిమాకి తెలుగు, త‌మిళంలోనే కాకుండా హిందీలోను ప్ర‌చారం ప‌రంగా లోటు రానివ్వ‌డం లేదు. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రం థియేట్రికల్ ప్రీమియర్‌కు కేవలం రెండు వారాలు మాత్రమే ఉండటంతో దేవ‌ర‌కొండ టీమ్ తమ ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. విజయ్ సోషల్ మీడియాలో ముంబై ఈవెంట్ నుండి స్నాప్‌షాట్‌లను షేర్ చేసాడు. అందాల భామ మృణాల్ తో క‌లిసి అత‌డి ప్ర‌చారం హిందీ బెల్ట్ లో ఉత్సాహం పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు.

ఇదిలా ఉంటే దేవ‌ర‌కొండ త‌న సినిమాని ఐపీఎల్ లోను ప్ర‌చారం చేసుకోవ‌డంలో ముందున్నాడు. ఇంత‌కుముందు లైగ‌ర్, ఖుషీ చిత్రాల‌ను ఇదే తీరుగా ప్ర‌మోట్ చేసుకున్నాడు. ల‌క్ష‌లాది మంది బుల్లితెర‌పై ఐపీఎల్ మ్యాచ్ లు వీక్షిస్తారు గ‌నుక‌.. త‌మ సినిమాని అలాంటి వేదిక‌పై ప్ర‌మోట్ చేసుకోవాల‌నే విజ‌య్ ఆలోచ‌న‌ను ప్రశంసించి తీరాలి. నిజం చెప్పాలంటే ఐపీఎల్ సీజ‌న్ లో సినిమాలు రిలీజ‌వ్వ‌డం సాహ‌సం అనుకుంటే, అందుకు భిన్నంగా ప్ర‌తికూల అంశాన్ని కూడా సానుకూలంగా మార్చుకుంటూ విజ‌య్ ఇప్పుడు ప్ర‌చార‌ఫ‌ర్వంలో విజ‌యం సాధిస్తున్నాడు.

ఫ్యామిలీ స్టార్ విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా టీజర్ ఇటీవ‌ల విడుద‌లై ఆక‌ట్టుకుంది. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి విజయ్ ఎంత‌ హింసకు అయినా తెగించే వాడిగా క‌నిపించాడు. ఇంటి పనుల్లో నిమగ్నమై కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గ‌డిపే కుర్రాడిగా ఇందులో చూపారు. విజయ్ -మృణాల్ ఠాకూర్ న‌డుమ రొమాన్స్ ఆక‌ట్టుకుంది. ఇప్పుడు గీత గోవిందం త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి విజ‌యం అందుకుంటాడ‌నే అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.