Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ వాళ్లకి నచ్చుతాడా..?

గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న పరశురాం విజయ్ దేవరకొండ కాంబో రిపీట్ చేస్తూ ఈసారి ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నారు

By:  Tupaki Desk   |   21 March 2024 6:09 AM GMT
ఫ్యామిలీ స్టార్ వాళ్లకి నచ్చుతాడా..?
X

గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న పరశురాం విజయ్ దేవరకొండ కాంబో రిపీట్ చేస్తూ ఈసారి ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి మొదట్లో ఐరనే వంచాలా ఏంటి అన్న టీజర్ రాగా అది వైరల్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా రిలీజన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఫ్యామిలీని ఎలాంటి ఇబ్బంది లేకుండ పక్కా కాలిక్యులేటెడ్ గా ఉండే ఫ్యామిలీ మెన్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. అందుకే హీరోయిన్ డ్రాప్ చేయమని అడిగినా సరే అమ్మాయి లిఫ్ట్ అడిగింది కదా అని ఆనంద పడకుండా లీటర్ పెట్రోల్ ఖర్చు అవుతుందని అంటాడు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మ్యాన్ కష్టాలను సినిమాలో చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు.

అయితే విజయ్ కు ఉన్న యూత్ ఫాలోయింగ్ లో మాస్ ప్రియులే ఎక్కువ. వారిని సాటిస్ఫై చేసేలా సినిమా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ ఇవి సరిగ్గా వర్క్ అవుట్ అయితే ఎలాంటి ఆడియన్స్ ని అయినా సినిమా చూసేలా చేస్తుంది. అయితే ఫ్యామిలీ స్టార్ మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతాడా అనే డౌట్ మొదలైంది. ఫ్యామిలీ స్టార్ లో కూడా మాస్ యాంగిల్ ఉంది. తన ఫ్యామిలీకి కష్టం వచ్చినప్పుడు ప్రతి ఫ్యామిలీ మెన్ హీరోగా మరతాడు అదే పాయింట్ ఈ సినిమాలో చూపించబోతున్నారు.

సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. సో ఫ్యామిలీ స్టార్ కంప్లీట్ ఎంటర్టైనర్ గా సమ్మర్ కి ఆడియన్స్ ని ఖుషి చేసేందుకు వస్తుంది. ఈ సినిమాలో లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సర్కారు వారి పాట తర్వాత పరశురాం చేస్తున్న ఫ్యామిలీ స్టార్ ఏమేరకు ఆడియన్స్ మెప్పు పొందుతాడు అన్నది చూడాలి. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరితో స్పై యాక్షన్ మూవీ చేస్తున్నాడు. సితార్ బ్యానర్ లో ఆ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.