Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్.. ఆ సర్ ప్రైజ్ థియేటర్లోనే..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న రెండవ సినిమా ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయ్యింది

By:  Tupaki Desk   |   13 March 2024 6:20 PM GMT
ఫ్యామిలీ స్టార్.. ఆ సర్ ప్రైజ్ థియేటర్లోనే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న రెండవ సినిమా ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయ్యింది. ఇక రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఒక్కోపాటను విడుదల చేస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక రెండవ సాంగ్ కల్యాణి వచ్చే వచ్చే.. కూడా ఇటీవల విడుదలైంది.

అందులో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ విజువల్స్ కూడా ఓ వర్గం ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. తప్పకుండా సినిమాలో ఈ సాంగ్ చాలా హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. అయితే అందులో విజయ్ క్యారెక్టర్ మిడిల్ క్లాస్ అబ్బాయి తరహాలో ఉండబోతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశారు.

ఇక కళ్యాణి వచ్చే వచ్చే సాంగ్ వైరల్ అవుతున్న క్రమంలోనే రకరకాల మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. హీరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ పాట ఇంత రిచ్ గా ఎలా ఉంటుంది అనేలా కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. బహుశా హీరోయిన్ ఫ్యామిలీ డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు అని మరి కొందరు సమాధానం ఇచ్చారు. అది డ్రీమ్స్ సాంగ్ కూడా అయ్యి ఉండవచ్చు అని మరికొందరు స్పందించారు.

ఇక ఇలాంటి కామెంట్స్ ఎన్ని వస్తున్నా కూడా ఓవర్గం ఫ్యాన్స్ అయితే ఇందులో రష్మిక కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ మరొక విధంగా డిసప్పాయింట్ అవుతున్నారు. రష్మిక ఈ సినిమాలో కనిపించబోతోంది అని ముఖ్యంగా కళ్యాణి వచ్చే వచ్చే సాంగ్ లోనే.. ఆమె స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా కూడా కథనాలు వెలువడ్డాయి.

ఒక విధంగా రష్మిక అయితే సినిమాలో కనిపించబోతోందన్న విషయం మాత్రం నిజమే. అయితే ఆమె పాటలో కనిపిస్తుందా లేదంటే మిగతా సినిమాలో ఏదైనా స్పెషల్ పాత్రలో కనిపిస్తుందా అనేది వేచి చూడాలి. అయినా అలాంటి సర్ ప్రైజ్ పాత్రను ముందుగానే ఒక లిరికల్ సాంగ్ లో చూపిస్తే కిక్కేమీ ఉంటుందని, సినిమాలో చూస్తేనే మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది అని మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఏది ఏమైనా ఫ్యామిలీ స్టాల్ సినిమా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మొదట మార్చిలోనే విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఏప్రిల్ 5కు దేవర రావాల్సి ఉండగా అది వాయిదా పడడంతో ఆ డేట్ కు ఫ్యామిలీ స్టాక్ ను దింపుతున్నారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో తప్పకుండా ఈ డేట్ కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.