Begin typing your search above and press return to search.

భ‌ర్త కోసం శ్రుతి హాస‌న్ సాహ‌సం!

అమ్మ‌డు 'ది ఐ' చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది. వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషించ‌డం అంటే శ్రుతికి ఎంతో ఆస‌క్తి. ఈనేప‌థ్యంలో హాలీవుడ్ లోనూ అలాంటి అటెంప్ట్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   3 Oct 2023 12:30 PM GMT
భ‌ర్త కోసం శ్రుతి హాస‌న్ సాహ‌సం!
X

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ లో అల‌రించిన శ్రుతిహాస‌న్ ఇప్పుడు హాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు 'ది ఐ' చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది. వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషించ‌డం అంటే శ్రుతికి ఎంతో ఆస‌క్తి. ఈనేప‌థ్యంలో హాలీవుడ్ లోనూ అలాంటి అటెంప్ట్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా. ఇందులో శ్రుతి హాస‌న్ కి జోడీగా మార్క్ రౌలీ న‌టిస్తున్నారు. సినిమాలో శ్రుతి హాస‌న్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఓ సాహ‌స‌పేత‌మైన పాత్ర‌లోనే క‌నిపిస్తుంది. చ‌నిపోయిన భ‌ర్త అస్తిక‌ల్ని ఓ ద్వీపంలో క‌లిపేందుకు ఒంట‌రిగా ఆమె ఎలా ప్రయాణం చేసింది? భ‌ర్త మ‌ర‌ణానికి కార‌ణం ఎవ‌రు? అనే తెలుసుకునే ప్ర‌క్రియ‌లో ఆమె ఎలాంటి అవ‌రోధాలు ఎదుర్కుంది? అన్న అంశాలు చుట్టూ సినిమా న‌డుస్తుందిట‌. దీన్ని బ‌ట్టి సినిమాలో శ్రుతిహాస‌న్ పాత్ర చాలెంజింగ్ గానే ఉంటుంద‌ని తెలుస్తోంది. ద్వీపంలోకి ఆమె ప్ర‌యాణం ఎంతో థ్రిల్లింగ్ గురిచేసేదే.

అలాగే భ‌ర్త కోసం ఆమె చేసే పోరాటం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఓ పోస్ట‌ర్ కూడా రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా శ్రుతి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. 'మాయాజాలం..భావోద్వేగం.. నిజాయితీతో కూడిన సినిమాల్లో భాగ‌మ‌వుతుంటారు. అలాంటి సినిమా ఇది. నా కెంతో ప్ర‌త్యేకం' అని తెలిపింది. ఇందులో 'ది లాస్ట్ కింగ్ డ‌మ్' ఫేమ్ మార్క్ రౌల్ హీరోగా న‌టిస్తున్నాడు.

డాప్నే ష్మోన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ . సినిమా రిలీజ్ తేదిని ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇది గాక శ్రుతి హాస‌న్ తెలుగులో భారీ సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 'స‌లార్' షూటింగ్ పూర్తిచేసింది. డిసెంబ‌ర్ లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే నాని హీరోగా న‌టిస్తోన్న 'హాయ్ నాన్న‌'లోనూ న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఈసినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా త‌మిళ్ లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది.