Begin typing your search above and press return to search.

'ప్రేమలు' తెలుగులో.. డైలాగ్స్ రాస్తోంది ఎవరంటే..

ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 4:28 AM GMT
ప్రేమలు తెలుగులో.. డైలాగ్స్ రాస్తోంది ఎవరంటే..
X

మలయాళంలో చిన్న సినిమాగా తెరకెక్కి ఏకంగా 70 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసిన సినిమా ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీనేజ్ ఎంటర్టైనర్ గా మూవీని ప్రేక్షకులకి అందించారు. ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్ చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ రైట్స్ కూడా సొంతం చేసుకొని వర్క్ మొదలు పెట్టారు.

గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మమిత బైజు, అఖిల రాఘవేంద్రన్, మీనాక్షి రవీంద్రన్ ఫిమేల్ లీడ్ గా నటించారు. అల్తాఫ్ సలీం, నస్లీన్, సంగీత ప్రతాప్ మేల్ లీడ్ పాత్రలలో నటించారు. టీనేజ్ రొమాంటిక్ కామెడీ జోనర్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది.

ఇలాంటి సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ ఉంటుందని బేబీ మూవీ ప్రూవ్ చేసింది. డబ్బింగ్ సినిమా అయిన కంటెంట్ బాగుంటే తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారని చాలా మూవీస్ ప్రూవ్ చేశాయి. కన్నడ మూవీ కాంతార ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ప్రేమలు చిత్రానికి యూత్ నుంచి ఆదరణ లభించే అవకాశం ఉందని కార్తికేయ తెలుగులో డబ్ చేయడానికి సిద్ధమయ్యారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు వెర్షన్ కి 90s ఫేమ్ ఆదిత్య హాసన్ సంభాషణలు రాస్తూ ఉండటం విశేషం. ఇప్పటికే ఈ యంగ్ డైరెక్టర్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు అడ్వాన్స్ లు ఇచ్చాయి. ఇప్పుడు ప్రేమలు తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాస్తూ ఉండటంతో కచ్చితంగా కొత్తదనం తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

ప్రేమలు టైటిల్ తోనే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇది నేటివిటీకి దగ్గరగా ఉండే టైటిల్ కావడంతో పాటు భాగా ట్రెండ్ అవ్వడంతో ప్రేమలుకి కార్తికేయ మొగ్గు చూపినట్లు సమాచారం. మరి ఈ సినిమాకి తెలుగు నాట ఎలాంటి ఆదరణ లభిస్తుంది అనేది వేచి చూడాలి.